Pinterest ఇతరుల ట్రేడ్‌మార్క్ హక్కులను గౌరవించడంతో పాటు పిన్నర్‌లు కూడా అలాగే చేయాలని ఆశిస్తుంది. ఇతరులను తప్పుదారి పట్టించే లేదా వేరొకరి ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లంఘించే కంటెంట్‌కు యాక్సెస్‌ను Pinterest నిలిపివేయవచ్చు. అలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేసే లేదా షేర్ చేసే వినియోగదారులను Pinterest నిలిపివేయడం లేదా తొలగించడం వంటివి కూడా చేయవచ్చు. అదనంగా, Pinterest వినియోగదారు పేర్లను తగిన విధంగా బదిలీ చేయవచ్చు.

Pinterestలోని ఎవరైనా మీ ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించే విధంగా ఉపయోగిస్తున్నారని మీకు ఆందోళనగా ఉన్నట్లయితే, మేము అందజేసే సులభంగా ఉపయోగించగలిగే ఆన్‌లైన్ ఫారమ్ ద్వారా ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన నివేదికను సమర్పించి మాకు తెలియజేయండి. మేము మీ సమర్పణను సమీక్షించి, తగిన చర్య తీసుకుంటాము.

మీ ఆందోళనలను గురించి మమ్మల్ని సంప్రదించడానికి ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన నివేదిక ఉత్తమ మార్గంగా ఉండగా, మీరు trademark [at] pinterest.com (trademark[at]pinterest[dot]com)లో మాకు ఇమెయిల్ కూడా పంపగలరు.

ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన నివేదిక ఆధారంగా మీ కంటెంట్ తీసివేయబడినట్లయితే, మీరు trademark [at] pinterest.com (trademark[at]pinterest[dot]com)కు ఇమెయిల్ పంపడంతో పాటు ఆ నివేదిక చెల్లుబాటు కానిదని మీరు ఎందుకు భావిస్తున్నారో మాకు తెలియజేయడం ద్వారా దాన్ని సవాలు చేయగలరు. దయచేసి ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన నివేదిక రెఫరెన్స్ నంబర్‌ను చేర్చండి. మేము ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన నివేదిక నుండి సమాచారాన్ని ఫార్వార్డ్ చేయాలని మీరు కోరుకున్నట్లయితే, ట్రేడ్‌మార్క్ ఫిర్యాదు రెఫరెన్స్ నంబర్‌తో trademark [at] pinterest.com (trademark[at]pinterest[dot]com)లో మాకు ఇమెయిల్ పంపడం ద్వారా మాకు తెలియజేయండి. మేము (మేము వ్యక్తిగత సంప్రదింపు సమాచారాన్ని తీసివేసే అవకాశం ఉన్నప్పటికీ) దాన్ని సంతోషంగా పంపుతాము.  

ట్రేడ్‌మార్క్ హక్కులను పునరావృతంగా ఉల్లంఘించే లేదా ట్రేడ్‌మార్క్ హక్కులు లేదా ఇతర మేథోసంపత్తి హక్కులను ఉల్లంఘిస్తున్న కారణంగా పునరావృతంగా ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తుల ఖాతాలను—తగిన పరిస్థితులలో మరియు మా స్వంత అభీష్టానుసారం తాత్కాలికంగా నిలిపివేయడం లేదా తొలగించడం—మా విధానం.  అలాంటి వినియోగదారులపై తీసుకునే చర్యలలో ఇతర విషయాలతో పాటుగా కంటెంట్‌ను పోస్ట్ చేయగల వారి సామర్థ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం కూడా చేర్చబడవచ్చు. 

ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన నివేదికను సమర్పించండి

ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన నివేదికను సమర్పించడం కోసం, మీరు మా ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపగలరు.

ట్రేడ్మార్క్ ఫిర్యాదు ఫారమ్ నింపండి

మీరు ఈ ఫారమ్‌ను ఉపయోగించకూడదని కోరుకున్నట్లయితే, దయచేసి trademark [at] pinterest.com (trademark[at]pinterest[dot]com)కు క్రింది సమాచారాన్ని పంపండి:

  • మీ పూర్తి చట్టబద్ధమైన పేరు మరియు మీ ఎలక్ట్రానిక్ లేదా భౌతిక సంతకం (ఉదాహరణకు, మీ పూర్తి పేరును టైప్ చేయడం ద్వారా).
  • ఉల్లంఘించబడ్డాయని మీరు విశ్వసించే ట్రేడ్‌మార్క్(ల) గుర్తింపు (ఉదా. ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా సాధారణ చట్టం ట్రేడ్‌మార్క్ హక్కులను ప్రదర్శించే అంశాలను అందించండి).
  • మీ హక్కులు Pinterestలో ఉల్లంఘించబడుతున్నాయని మీరు క్లెయిమ్ చేసే కంటంట్‌తో సహా దాన్ని కనుగొనడంలో మాకు సహాయపడటానికి మాకు అవసరమైన సమాచారంతో సహా Pinterestలోని  కంటెంట్(పిన్, బోర్డు లేదా ఖాతా)కు URL వంటివి.
  • నివేదించబడిన కంటెంట్ మీ ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లంఘిస్తోందని మీరు ఎందుకు విశ్వసిస్తున్నారనే దానికి సంబంధించిన వివరణ.
  • క్రింది విధంగా తెలియజేసే ఒక ప్రకటన:
    • మీ నివేదికలో వివరించబడిన ట్రేడ్‌మార్క్‌ల వినియోగం మీ ట్రేడ్‌మార్క్(లు) లేదా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న యజమాని ట్రేడ్‌మార్క్(ల)ను ఉల్లంఘిస్తోందని మీకు నిజాయితీగా నమ్మకం ఉంది.
    • మీ నివేదికలోని సమాచారం వాస్తవం అని, అలాగే సరైనదని మీరు సూచిస్తున్నారు. 
    • అబద్ధపు ఆరోపణల అపరాధం ప్రకారం, ఉల్లంఘించబడినట్లు ఆరోపించబడిన ట్రేడ్‌మార్క్(ల)ను మీరు కలిగి ఉన్నారు లేదా వాటిని కలిగి ఉన్న యజమాని తరపున పని చేయడానికి స్పష్టమైన అధికారాన్ని కలిగి ఉన్నారు.
    • నివేదించబడిన కంటెంట్‌కు బాధ్యత వహించే వినియోగదారుకు నివేదిక కాపీని పంపే అవకాశం ఉందని మీరు అర్థం చేసుకున్నారు.
  • మీ మెయిలింగ్ చిరునామా, ఫోన్ నంబర్ మరియు ఇమెయిల్ చిరునామా.
  • వాణిజ్య చిహ్నం ఉల్లంఘన నివేదికను అప్పీల్ చేయండి

    పిన్ పొరపాటున తీసివేయబడినట్లు లేదా వాణిజ్య చిహ్నం యజమాని కొన్ని విషయాల్లో పొరపాటు చేసినట్లు మీరు విశ్వసిస్తే (ఉదా., మీ పిన్ నివేదించిన వారి యొక్క వాణిజ్య చిహ్నం హక్కులను ఉల్లంఘించలేదని మీరు వాదించడం లేదా నివేదించిన వారికి స్వంత వాణిజ్య చిహ్నం లేకపోవడం), మీరు trademark [at] pinterest.com (trademark[at]pinterest[dot]com) చిరునామాకు ఇమెయిల్ పంపడం ద్వారా నివేదికను వ్యతిరేకించవచ్చు.  అప్పీలును సమర్పించడానికి, దయచేసి వీటిని అందించండి: 

  • వాణిజ్య చిహ్నాన్ని మీరు వినియోగించడం అనేది ఉల్లంఘించడం కాదని మరియు ఆ విశ్వాసానికి ఆధారం అని మీకు మంచి విశ్వాసం ఉన్నట్లు వివరించే ప్రకటన
  • అప్పీలు యొక్క కాపీ మీ అప్పీలు ద్వారా ప్రభావితమైన ప్రస్తుత ఖాతా దారు(ల)కి పంపవచ్చని మీరు అర్థం చేసుకున్నట్లు తెలియజేసే ప్రకటన
  • మీ పేరు, చిరునామా మరియు టెలిఫోన్ నంబర్
  • మీ అప్పీలులోని సమాచారం ఖచ్చితంగా ఉన్నట్లు తెలియజేసే ప్రకటన

     
  • Pinterestలో నకిలీల నిరోధకం

    Pinterestలో నకిలీ వస్తువులను విక్రయించకుండా లేదా విక్రయాన్ని ప్రమోట్ చేయకుండా వినియోగదారులను Pinterest నిషేధిస్తుంది. ట్రేడ్‌మార్క్ యజమాని నుండి అనుమతి లేకుండా మరొకరి ట్రేడ్‌మార్క్‌తో సారూప్యమైన లేదా దాని నుండి గణనీయంగా వేరు చేయలేని ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించి ప్రమోట్ చేసిన, విక్రయించిన లేదా పంపిణీ చేసిన వస్తువులను నకిలీ వస్తువులు అంటారు. 

    Pinterestలోని  కంటెంట్ నకిలీలను విక్రయిస్తోంది లేదా ప్రమోట్ చేస్తోంది అని మీరు విశ్వసించినట్లయితే, మేము అందజేసే సులభంగా ఉపయోగించగలిగే, ఆన్‌లైన్ ఫారమ్‌ను ఉపయోగించి మీరు నకిలీకి సంబంధించిన నివేదికను సమర్పించగలరు. మీరు trademark [at] pinterest.com (trademark[at]pinterest[dot]com)లో మాకు ఇమెయిల్ పంపడం ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీని నివేదించగలరు. 

    మేము మీ సమర్పణను సమీక్షించి, తగిన చర్య తీసుకుంటాము.  

    నకిలీకి సంబంధించిన నివేదిక ఆధారంగా మీ కంటెంట్ తీసివేయబడినట్లయితే, మీరు trademark [at] pinterest.com (trademark[at]pinterest[dot]com)కు ఇమెయిల్ పంపడం ద్వారా, ఆ నివేదిక చెల్లుబాటు కానిదని మీరు ఎందుకు భావిస్తున్నారో మాకు తెలియజేయడం ద్వారా దాన్ని సవాలు చేయగలరు. దయచేసి నివేదిక రెఫరెన్స్ నంబర్‌ను చేర్చండి. మేము నివేదిక నుండి సమాచారాన్ని ఫార్వార్డ్ చేయాలని మీరు కోరుకున్నట్లయితే, నివేదిక రెఫరెన్స్ నంబర్‌తో trademark [at] pinterest.com (trademark[at]pinterest[dot]com)కు ఇమెయిల్ పంపడం ద్వారా మాకు తెలియజేయండి. మేము (మేము వ్యక్తిగత సంప్రదింపు సమాచారాన్ని తీసివేసే అవకాశం ఉన్నప్పటికీ) దాన్ని సంతోషంగా పంపుతాము.  

    కఠినమైన లేదా పునరావృతంగా నకిలీలు చేస్తున్నట్లు గుర్తించబడిన వినియోగదారులను—తగిన పరిస్థితులలో మరియు మా స్వంత అభీష్టానుసారం తాత్కాలికంగా నిలిపివేయడం లేదా తొలగించడం—మా విధానం. మా నకిలీ విధానాన్ని ఉల్లంఘించిన కారణంగా కంటెంట్ తీసివేయబడిన వినియోగదారులకు నిర్దిష్ట సేవలు లేదా రద్దు చేయబడిన ప్రోగ్రామ్‌లకు (ఉదా. ప్రకటనల అధికారాలు, వ్యాపారి, అలాగే ధృవీకృత వ్యాపారి ప్రోగ్రామ్‌లు వంటి వాటికి) యాక్సెస్‌ను తీసివేయడం వంటి అదనపు పర్యవసానాలను కూడా ఎదుర్కోవచ్చు.

     

    నకిలీని నివేదించే ఫారమ్‌ను నింపండి