Pinterest ఉపయోగించినందుకు ధన్యవాదాలు!

ఈ సేవా నిబంధనలు ("నిబంధనలు") Pinterest వెబ్‌సైట్, యాప్‌లు, APIలు మరియు విడ్జెట్‌లకు (“Pinterest” లేదా “సేవ”) మీ యాక్సెస్‌ను మరియు వాటి వినియోగాన్ని నియంత్రిస్తాయి. దయచేసి ఈ నిబంధనలను జాగ్రత్తగా చదవండి, ఆపై మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. Pinterestని యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం ద్వారా, మీరు ఈ నిబంధనలు, మా గోప్యతా విధానం , మా కుక్కీల విధానం మరియు మా సంఘం మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటారని అంగీకరిస్తున్నారు.

మరింత సరళంగా చెప్పాలంటే

ప్రతి కంపెనీకి దాని స్వంత నిబంధనలు ఉంటాయి. ఇవి మా నిబంధనలు.

1. మా సేవ

మీరు ఇష్టపడే వాటిని కనుగొనడంలో మరియు చేయడంలో Pinterest మీకు సహాయపడుతుంది. అలా చేయడానికి, మీ ఆన్‌సైట్ మరియు ఆఫ్‌సైట్ కార్యాచరణ ఆధారంగా మీకు సంబంధింగా, ఆసక్తికరంగా మరియు వ్యక్తిగతంగా ఉంటాయని మేము భావించే అంశాలను మీకు చూపుతాము. మా సేవను అందించడానికి, మేము మిమ్మల్ని మరియు మీ ఆసక్తులను గుర్తించగలగాలి. మేము మీకు చూపించే కొన్ని అంశాలు ప్రకటనదారుల ద్వారా ప్రమోట్ చేయబడతాయి. మా సేవలో భాగంగా, ప్రమోట్ చేయబడిన కంటెంట్ కూడా మీకు సంబంధితంగా మరియు ఆసక్తికరంగా ఉండేలా చేయడానికి మేము ప్రయత్నిస్తాము. ప్రమోట్ చేయబడిన కంటెంట్‌కు స్పష్టంగా లేబుల్ ఉంటుంది, కనుక మీరు దాన్ని గుర్తించవచ్చు.

మరింత సరళంగా చెప్పాలంటే

మీరు ఇష్టపడే వాటిని కనుగొనడంలో మరియు చేయడంలో Pinterest మీకు సహాయపడుతుంది. ఇది మీకు అనుకూలీకరించబడింది. Pinterestలో ప్రతిదీ మీకు సంబంధితంగా ఉండేలా చేయడానికి మీరు ఇష్టపడే వాటి గురించి మేము తెలుసుకోవాలి.

2. Pinterestను ఉపయోగించడం
ఎ. Pinterestను ఎవరు ఉపయోగించవచ్చు

మీరు Pinterestతో చట్టబద్ధంగా ఒప్పందం కుదుర్చుకోగలిగి, ఆపై ఈ నిబంధనలు మరియు వర్తించే చట్టాలన్నింటికీ లోబడి మాత్రమే మీరు Pinterestను ఉపయోగించవచ్చు. మీరు మీ Pinterest ఖాతాను సృష్టించినప్పుడు, మాకు ఖచ్చితమైన మరియు పూర్తి సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి. యు.ఎస్. ఆంక్షల ప్రకారం నిషేధించబడి ఉంటే, మీరు Pinterestను ఉపయోగించలేరు. 13 ఏళ్లలోపు ఎవరైనా ఏ విధంగానైనా ఉపయోగించడం లేదా యాక్సెస్ చేయడం అనుమతించబడదు. మీరు EEAలో ఉంటున్నట్లయితే, మీ దేశ చట్టాల ప్రకారం డేటా ప్రాసెసింగ్‌కు సమ్మతి అందించగల వయస్సును మీరు దాటి ఉన్నట్లయితే మాత్రమే Pinterestను ఉపయోగించవచ్చు. మీ కంప్యూటర్, ఫోన్, టాబ్లెట్ లేదా ఇతర పరికరానికి సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయడం వంటివి Pinterestను ఉపయోగించడం క్రిందికి రావచ్చు. మేము ఆ సాఫ్ట్‌వేర్‌ను స్వయంచాలకంగా అప్‌డేట్ చేయవచ్చని మీరు అంగీకరిస్తున్నారు, అలాగే ఏవైనా అప్‌డేట్‌లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

బి. మీకు మా లైసెన్స్

ఈ నిబంధనలు మరియు మా విధానాలకు (మా సంఘం మార్గదర్శకాలతో సహా) లోబడి, మా సేవను ఉపయోగించడానికి మేము మీకు పరిమిత, ప్రత్యేకం కాని, బదిలీ చేయలేని మరియు ఉపసంహరించుకునే లైసెన్స్‌ను మంజూరు చేస్తాము.

సి. Pinterest యొక్క వాణిజ్య ఉపయోగం

మీరు వాణిజ్య ప్రయోజనాల కోసం Pinterestను ఉపయోగించాలనుకుంటే, తప్పనిసరిగా వ్యాపార ఖాతాను సృష్టించాలి మరియు మా వ్యాపార సేవా నిబంధనలకు అంగీకరించాలి. మీరు కంపెనీ, సంస్థ లేదా ఇతర సంస్థ కోసం ఖాతాను తెరిస్తే, "మీరు" అనేది మిమ్మల్ని మరియు ఆ సంస్థను సూచిస్తుంది, అలాగే ఈ నిబంధనలలో అందించబడిన అన్ని అనుమతులు మరియు లైసెన్‌లను మంజూరు చేయడానికి మరియు ఈ నిబంధనలకు సంస్థ లోబడి ఉండేలా చేయడానికి మీకు అధికారం ఉన్నట్లు హామీ ఇస్తున్నారు మరియు సంస్థ తరఫున ఈ నిబంధనలకు మీరు అంగీకరిస్తున్నారు.

మరింత సరళంగా చెప్పాలంటే

మీ వయస్సు 13 ఏళ్లలోపు (లేదా కొన్ని దేశాలలో అంతకంటే ఎక్కువ) ఉంటే, మీరు Pinterestను ఉపయోగించలేరు. అలాగే, మీరు కార్యాలయం కోసం Pinterestని ఉపయోగిస్తున్నట్లయితే, వ్యాపార ఖాతాను సెటప్ చేయాలి.

3. మీ కంటెంట్
ఎ. కంటెంట్‌ను పోస్ట్ చేయడం

ఫోటోలు, వ్యాఖ్యలు, లింక్‌లు మరియు ఇతర అంశాలతో సహా కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి Pinterest మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు Pinterestలో పోస్ట్ చేసే లేదా అందుబాటులో ఉంచే ఏదైనా "వినియోగదారు కంటెంట్‌"గా సూచించబడుతుంది. మీరు Pinterestకు పోస్ట్ చేసే వినియోగదారు కంటెంట్‌లో అన్ని హక్కులను కలిగి ఉంటారు మరియు పూర్తిగా బాధ్యత వహిస్తారు.

మరింత సరళంగా చెప్పాలంటే

మీరు Pinterestలో మీ కంటెంట్‌ను పోస్ట్ చేసినప్పటికీ, అది మీకు చెందినదిగానే ఉంటుంది.

బి. Pinterest మరియు ఇతర వినియోగదారులు మీ కంటెంట్‌ను ఎలా ఉపయోగిస్తారు

కేవలం Pinterestను నిర్వహించడం, అభివృద్ధి చేయడం, అందించడం మరియు ఉపయోగించడం వంటి ప్రయోజనాల కోసం Pinterestలో మీ వినియోగదారు కంటెంట్‌ను ఉపయోగించడానికి, నిల్వ చేయడానికి, ప్రదర్శించడానికి, పునరుత్పత్తి చేయడానికి, సేవ్ చేయడానికి, సవరించడానికి, అనుబంధ రచనలను సృష్టించడానికి, అమలు చేయడానికి మరియు పంపిణీ చేయడానికి Pinterest మరియు మా వినియోగదారులకు సాధారణ, రాయల్టీ రహిత, బదిలీ చేయగల, ఉపలైసెన్స్ అందించగల, ప్రపంచవ్యాప్త లైసెన్స్‌​ను మీరు మంజూరు చేస్తున్నారు. ఇతర లైసెన్స్‌ల క్రింద వినియోగదారు కంటెంట్‌కు Pinterest కలిగి ఉండేటటువంటి ఇతర చట్టబద్ధమైన హక్కులు వేటినీ ఈ నిబంధనలలో ఏదీ పరిమితం చేయదు. ఏ కారణం చేతనైనా వినియోగదారు కంటెంట్‌ను తీసివేయడానికి లేదా సవరించడానికి లేదంటే Pinterestలో అది ఉపయోగించబడే విధానాన్ని మార్చడానికి మాకు హక్కు ఉంది. ఈ నిబంధనలు, మా సంఘం మార్గదర్శకాలు లేదా ఏవైనా ఇతర విధానాలను ఉల్లంఘిస్తున్నట్లు మేము విశ్వసిస్తున్న వినియోగదారు కంటెంట్ ఇందులో ఉంటుంది.

మరింత సరళంగా చెప్పాలంటే

మీరు Pinterestలో మీ కంటెంట్‌ను పోస్ట్ చేస్తే, మేము దాన్ని వ్యక్తులకు చూపవచ్చు మరియు ఇతరులు దాన్ని సేవ్ చేయవచ్చు. నగ్నత్వ కంటెంట్ లేదా స్పామ్‌ను పోస్ట్ చేయవద్దు లేదంటే Pinterestలో ఇతర వ్యక్తులకు ఆందోళన కలిగించవద్దు. 

సి. మేము మీ కంటెంట్‌ను ఎంతకాలం ఉంచుకుంటాము

మీ ఖాతాను రద్దు చేసిన లేదా నిష్క్రియం చేసిన తర్వాత లేదా మీరు Pinterest నుండి ఏదైనా వినియోగదారు కంటెంట్‌ను తీసివేసినట్లయితే, మేము బ్యాకప్, ఆర్కైవల్ లేదా ఆడిట్ ప్రయోజనాల కోసం మీ వినియోగదారు కంటెంట్‌ను సహేతుకమైన సమయ వ్యవధి వరకు ఉంచుకోవచ్చు. Pinterestలో ఇతర వినియోగదారులు నిల్వ చేసిన లేదా భాగస్వామ్యం చేసిన మీ వినియోగదారు కంటెంట్‌లో దేన్నైనా Pinterest మరియు దాని వినియోగదారులు భద్రపరుచుకోవచ్చు మరియు ఉపయోగించడం కొనసాగించవచ్చు, నిల్వ చేయవచ్చు, ప్రదర్శించవచ్చు, పునరుత్పత్తి చేయవచ్చు, సవరించవచ్చు, అనుబంధ రచనలను సృష్టించవచ్చు, అమలు చేయవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు.

మరింత సరళంగా చెప్పాలంటే

మీరు కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి ఎంచుకుంటే, Pinterestను అందించడానికి మరియు మెరుగుపరచడానికి దాన్ని ఉపయోగించేందుకు మాకు అనుమతి ఇస్తున్నారు. మీరు మీ ఖాతా నుండి కంటెంట్‌ను తొలగించిన తర్వాత కూడా ఇతరులతో భాగస్వామ్యం చేసిన కంటెంట్ కాపీలు అలాగే ఉండవచ్చు.

 

డి. మీరు అందించే అభిప్రాయం

మేము మా వినియోగదారుల నుండి అభిప్రాయాలకు విలువనిస్తాము మరియు Pinterestను మరింత అద్భుతంగా మార్చగల మార్గాల గురించి తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటాము. మీరు వ్యాఖ్యలు, ఆలోచనలు లేదా అభిప్రాయాన్ని సమర్పించడానికి ఎంచుకుంటే, ఎటువంటి పరిమితి లేకుండా లేదా పరిహారం ఇవ్వకుండా వాటిని ఉపయోగించగల స్వేచ్ఛ మాకు ఉందని మీరు అంగీకరిస్తున్నారు. మీ సమర్పణను ఆమోదించడం ద్వారా, Pinterestకి ఇంతకుముందు తెలిసిన లేదా దాని ఉద్యోగులు రూపొందించిన లేదా మీరు కాకుండా ఇతర వనరుల నుండి పొందిన సారూప్య లేదా సంబంధిత అభిప్రాయాన్ని ఉపయోగించగల హక్కులు వేటినీ Pinterest వదులుకోదు.

మరింత సరళంగా చెప్పాలంటే

Pinterestను మెరుగైనదిగా తీర్చిదిద్దడంలో మేము మీ సూచనలను ఉపయోగించవచ్చు.

4. కాపీరైట్ విధానం

డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం మరియు వర్తించే ఇతర కాపీరైట్ చట్టాలకు అనుగుణంగా Pinterest కాపీరైట్ విధానాన్ని Pinterest అవలంబించింది మరియు అమలు చేసింది. మరింత సమాచారం కోసం, దయచేసి మా కాపీరైట్ విధానాన్ని చదవండి. 

మరింత సరళంగా చెప్పాలంటే

మేము కాపీరైట్‌లను గౌరవిస్తాము. మీరు కూడా గౌరవించాలి.

5. భద్రత

మేము మా వినియోగదారుల భద్రతపై శ్రద్ధ వహిస్తాము. మీ కంటెంట్ మరియు ఖాతా యొక్క భద్రతను రక్షించడానికి మేము కృషి చేస్తున్నందున, అనధికార మూడవ పక్షాలు మా భద్రతా ప్రమాణాలను దాటలేవని Pinterest హామీ ఇవ్వదు. మీ పాస్‌వర్డ్‌ను సురక్షితంగా ఉంచుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. దయచేసి మీ ఖాతా హ్యాక్ చేయబడినా లేదా అనధికారికంగా వినియోగించబడినా మాకు వెంటనే తెలియజేయండి.

మరింత సరళంగా చెప్పాలంటే

మీరు ఈ భద్రతా చిట్కాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా స్పామర్‌లతో పోరాడటంలో మాకు సహాయపడగలరు.

6. మూడవ పక్షం లింక్‌లు, సైట్‌లు మరియు సేవలు

Pinterest మూడవ పక్షం వెబ్‌సైట్‌లు, ప్రకటనదారులు, సేవలు, ప్రత్యేక ఆఫర్‌లు లేదా Pinterest యాజమాన్యం లేదా నియంత్రణలో లేని ఇతర ఈవెంట్‌లు లేదా కార్యకలాపాలకు లింక్‌లను కలిగి ఉండవచ్చు. అటువంటి మూడవ పక్షం సైట్‌లు, సమాచారం, అంశాలు, ఉత్పత్తులు లేదా సేవలకు మేము ఎటువంటి బాధ్యతను ఆమోదించము లేదా తీసుకోము. మీరు ఏదైనా మూడవ పక్షం వెబ్‌సైట్, సేవ లేదా Pinterest నుండి కంటెంట్‌ను యాక్సెస్ చేస్తే, మీ స్వంత పూచీతో అలా చేయాలి మరియు మీరు ఏదైనా మూడవ పక్షం వెబ్‌సైట్, సేవ లేదా కంటెంట్‌ను ఉపయోగించడం లేదా యాక్సెస్ చేయడం వల్ల ఉత్పన్నమయ్యే బాధ్యత Pinterestకు లేదని మీరు అంగీకరిస్తున్నారు.

మరింత సరళంగా చెప్పాలంటే

Pinterest వెలుపల కంటెంట్‌కు Pinterest లింక్‌లను కలిగి ఉంది. ఆ అంశాలలో చాలావరకు అద్భుతంగా ఉంటాయి, ఒకవేళ అలా లేకపోతే దానికి మేము బాధ్యత వహించము.

7. రద్దు

తగిన నోటీసు అందించిన మీదట ఏ కారణం చేతనైనా Pinterestను యాక్సెస్ చేయగల లేదా ఉపయోగించగల మీ హక్కును Pinterest రద్దు చేయవచ్చు లేదా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. మా సంఘం మార్గదర్శకాల ఉల్లంఘనతో సహా ఏదైనా సహేతుకమైన కారణం ఉంటే, మేము వెంటనే మరియు నోటీసు లేకుండా మీ యాక్సెస్‌ను రద్దు చేయవచ్చు లేదా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. రద్దు చేసిన తర్వాత, మీరు ఈ నిబంధనలలో 3 మరియు 8 విభాగాలకు లోబడి ఉంటారు.

మరింత సరళంగా చెప్పాలంటే

Pinterest మీకు ఉచితంగా అందించబడుతుంది. ఎవరికైనా సేవలను తిరస్కరించే హక్కు మాకు ఉంది, కాని మేము తగిన నోటీసు ఇస్తాము.

8. నష్టపరిహారం

మీరు ఈ నిబంధనలలో విభాగం 2(సి) ప్రకారం అవసరమైన మేరకు మా వ్యాపార నిబంధనలను​ అంగీకరించకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం Pinterestను (అంటే, మీరు వినియోగదారు కాదు) ఉపయోగిస్తే, మా సేవను మీరు యాక్సెస్ చేయడం లేదా వినియోగించడానికి సంబంధించి ఏ మార్గంలో అయినా, మీ వినియోగదారు కంటెంట్ లేదా ఈ నిబంధనలలో దేనినైనా ఉల్లంఘించడం వలన సంభవించే ​ఏవైనా దావాలు, వ్యాజ్యాలు, విచారణలు, వివాదాలు, డిమాండ్‌లు, బాధ్యతలు, లోపాలు, నష్టాలు, ఖర్చులు మరియు వ్యయాలతో పాటుగా సహేతుకమైన చట్ట సంబంధిత మరియు అకౌంటింగ్ రుసుములకు (మూడవ పక్షాలు లేవనెత్తిన దావాలు, వ్యాజ్యాలు లేదా విచారణలను ఎదుర్కోవడానికి అయ్యే ఖర్చులతో పాటు) గానూ Pinterest Inc, Pinterest Europe Ltd, వారి అనుబంధ సంస్థలు మరియు వారి సంబంధిత అధికారులు, డైరెక్టర్‌లు, ఉద్యోగులు మరియు ఏజెంట్‌లకు నష్టపరిహారం చెల్లించడానికి మరియు నిరపరాధిగా ఉంచడానికి మీరు అంగీకరిస్తున్నారు.

మరింత సరళంగా చెప్పాలంటే

Pinterestలో మీ వ్యాపారం చేసే ఏదైనా పని కారణంగా మాపై కేసు దాఖలైతే, మా ఖర్చులను మీరు చెల్లించాలి. అలాగే, మీరు వ్యాపార ఖాతాను సృష్టించి, మా వ్యాపార నిబంధనలకు మొదటి స్థానంలో అంగీకరించి ఉండాలి.

9. నిరాకరణలు

మా సేవ మరియు Pinterestలోని మొత్తం కంటెంట్ అనేది స్పష్టమైన లేదా సూచిత వారెంటీ ఏదీ లేకుండా "యథాతథంగా" అందించబడుతుంది.

వర్తకం, నిర్దిష్ట ప్రయోజనానికి యోగ్యత మరియు ఉల్లంఘనరహితం యొక్క ఏదైనా మరియు అన్ని వారెంటీలు మరియు షరతులు, వాణిజ్య వ్యవహారం లేదా వినియోగం వల్ల ఉత్పన్నమయ్యే ఏవైనా వారెంటీలను Pinterest ప్రత్యేకంగా నిరాకరిస్తుంది.

మీరు లేదా ఎవరైనా ఇతర వ్యక్తి లేదా మూడవ పక్షం మా సేవలను ఉపయోగించి పోస్ట్ చేసే లేదా పంపే వినియోగదారు కంటెంట్ దేనికీ Pinterest ఎటువంటి బాధ్యత వహించదు మరియు పూచీగా ఉండదు. మీకు నిర్దిష్టం కాని, అభ్యంతరకరమైన, పిల్లలకు అనుచితమైన లేదా మీ ఉద్దేశ్యానికి సరిపోని వినియోగదారు కంటెంట్ చూపబడవచ్చని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు.

మీరు EEAలో ఉండే వినియోగదారు అయితే, స్థూల నిర్లక్ష్యం లేదా ఉద్దేశ్యం లేదా మా నిర్లక్ష్యం లేదా ఉద్దేశ్యపూర్వక దుష్ప్రవర్తన వలన కలిగే మరణం లేదా వ్యక్తిగత గాయాలకు మేము ఎటువంటి బాధ్యతను మినహాయించము లేదా పరిమితం చేయము. 

 

మరింత సరళంగా చెప్పాలంటే

దురదృష్టవశాత్తూ, Pinterest వంటి సేవల్లో వ్యక్తులు సరైనవి కాని విషయాలను పోస్ట్ చేస్తారు. మేము ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తాము, కానీ దాన్ని తీసివేసే అవకాశం మాకు రాక ముందే మీకు ఆ విషయాలు ఎదురుపడవచ్చు. మీరు సరైనవి కాని విషయాలు చూస్తే, దయచేసి ఇక్కడ మాకు నివేదించండి. 

10. బాధ్యత పరిమితి

చట్టం ద్వారా అనుమతించబడిన గరిష్ట పరిధి మేరకు, (ఎ) సేవకు మీ యాక్సెస్ లేదా సేవ యొక్క మీ వినియోగం లేదంటే సేవను యాక్సెస్ చేయలేకపోవడం లేదా ఉపయోగించలేకపోవడం; (బి) ఇతర వినియోగదారులు లేదా మూడవ పక్షాలు పరువు తక్కువగా, అభ్యంతరకరంగా లేదా చట్టవిరుద్ధంగా ప్రవర్తించడంతో పాటుగా సేవలో ఏదైనా మూడవ పక్షం యొక్క ప్రవర్తన లేదా కంటెంట్; లేదా (C) మీ ప్రసారాలు లేదా కంటెంట్‌ను అనధికారికంగా యాక్సెస్ చేయడం, ఉపయోగించడం లేదా మార్చడం వలన తలెత్తే ఏవైనా పరోక్ష, ఆకస్మిక, ప్రత్యేక, పరిణామపూర్వక లేదా తీవ్ర నష్టాలు లేదంటే లాభాలు లేదా రాబడులను కోల్పోవడం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంభవించినప్పటికీ, లేదంటే డేటా, వినియోగం, మంచిపేరు కోల్పోవడం లేదా కనిపించని ఇతర నష్టాలకు PINTEREST బాధ్యత వహించదు. సేవకు సంబంధించిన అన్ని దావాలకు PINTEREST యొక్క సమగ్ర బాధ్యత ఎట్టి పరిస్థితులలోనూ ఒక వంద డాలర్లకు (US $ 100.00) మించకూడదు.

మేము మీకు నష్టం కలిగిస్తే, మీరు EEAలో ఉంటున్న వినియోగదారు అయితే, ఎగువ పేర్కొన్నవి వర్తించవు. బదులుగా, Pinterest యొక్క బాధ్యత ఈ రకమైన ఒప్పందానికి సాధారణంగా వర్తించే ముఖ్యమైన ఒప్పంద బాధ్యతలను ఉల్లంఘించడం వలన తలెత్తేటటువంటి ముందుగానే అంచనా వేయదగిన నష్టాలకు పరిమితం చేయబడుతుంది. సంరక్షణకు సంబంధించి ఏదైనా వర్తించే ఇతర విధి యొక్క ముఖ్యమైనది కాని ఉల్లంఘన వలన కలిగే నష్టాలకు Pinterest బాధ్యత వహించదు. ఈ బాధ్యత పరిమితి అనేది పరిమితం చేయలేని ఏ చట్టబద్ధమైన బాధ్యతకు, మా నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తన కారణంగా సంభవించే మరణం లేదా వ్యక్తిగత గాయాలకు లేదంటే మేము మీకు ప్రత్యేకంగా హామీ ఇచ్చిన ఏదైనా విషయంలో మా బాధ్యతను మినహాయిస్తే మరియు మినహాయించడానికి వర్తించదు.

 

మరింత సరళంగా చెప్పాలంటే

మేము మీ కోసం వీలైనంత ఉత్తమ సేవను రూపొందిస్తున్నాము, కానీ అది పరిపూర్ణంగా ఉంటుందని మేము హామీ ఇవ్వలేము. మేము వివిధ విషయాలకు బాధ్యత వహించము. మేము బాధ్యత వహించాలని మీరు అనుకుంటే, పెద్ద మనుషుల తరహాలో ఈ విషయంపై కృషి చేయడానికి ప్రయత్నిద్దాము.

11. మధ్యవర్తిత్వం

మీకు Pinterestతో ఉండే ఏ వివాదం కోసం అయినా, మీరు మొదట మమ్మల్ని సంప్రదించి, అనధికారికంగా మాతో వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారని అంగీకరిస్తున్నారు. మేము మిమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటే, మీ Pinterest ఖాతాలోని ఇమెయిల్ చిరునామా ద్వారా సంప్రదిస్తాము. Pinterest మీతో వివాదాన్ని అనధికారికంగా పరిష్కరించలేకపోతే, ఈ నిబంధనల నుండి లేదా వీటికి సంబంధితంగా లేదా వీటికి సంబంధించి ఉత్పన్నమయ్యే ఏదైనా దావా, వివాదం లేదా వైరుధ్యాన్ని (నిషేధం లేదా దీనికి సమానమైన ఇతర పరిష్కారం కోసం దాఖలైన దావాలను మినహాయించి) బైండింగ్ మధ్యవర్తిత్వం ద్వారా లేదా చిన్న దావాల న్యాయస్థానంలో (వర్తించే దావాల కోసం) పరిష్కరించుకోవడానికి మనలో ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నాము.

కోర్టులో దావా వేయడం కంటే మా అభిప్రాయ భేదాలను పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం అనేది మరింత అనధికారిక మార్గం. ఉదాహరణకు, మధ్యవర్తిత్వంలో న్యాయమూర్తి లేదా ధర్మాసనానికి బదులుగా తటస్థ మధ్యవర్తి ఉంటారు, మరింత పరిమిత స్థాయిలో విషయాలను పరిశీలిస్తారు మరియు చాలా పరిమిత స్థాయిలో న్యాయస్థానాల సమీక్షకు లోబడి ఉంటాయి. ఈ ప్రక్రియ మరింత అనధికారికమైనప్పటికీ, న్యాయస్థానం అందించగల అదే స్థాయిలో మధ్యవర్తులు నష్టపరిహారాలు మరియు సహాయం అందేలా చేయగలరు. మీరు ఈ సేవా నిబంధనలకు అంగీకరించడం ద్వారా, యు.ఎస్. ఫెడరల్ ఆర్బిట్రేషన్ యాక్ట్ అనేది ఈ నియమం యొక్క వ్యాఖ్యానం మరియు అమలును నియంత్రిస్తుందని, అలాగే మీరు మరియు Pinterest ప్రతి ఒక్కరూ ధర్మాసన విచారణ కోరడానికి లేదా క్లాస్ యాక్షన్‌లో పాల్గొనడానికి హక్కును వదులుకుంటున్నట్లు అంగీకరిస్తున్నారు. ఈ బైండింగ్ మధ్యవర్తిత్వ ఒప్పందం యొక్క వ్యాఖ్యానం, వర్తింపు లేదా అమలుకు సంబంధించి తలెత్తే ఏదైనా వివాదాన్ని పరిష్కరించడానికి మధ్యవర్తికి ప్రత్యేక అధికారం ఉంటుంది. ఈ మధ్యవర్తిత్వ నియమం అనేది ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం మరియు మీ Pinterest ఖాతాను రద్దు చేయడం జరగకుండా నివారిస్తుంది.

ఏ మధ్యవర్తిత్వం అయినా వినియోగదారు మధ్యవర్తిత్వ నియమాల క్రింద అమెరికన్ ఆర్బిట్రేషన్ అసోసియేషన్ ("AAA") ద్వారా నిర్వహించబడుతుంది, ఆపై AAA కోసం అమలులో ఉంటుంది, అయితే ఇక్కడ పేర్కొన్న సందర్భాలలో మినహాయింపు ఉంటుంది. మీరు వారి ఫారమ్‌లను www.adr.orgలో చూడవచ్చు. మీరు మరియు Pinterest అంగీకరించకపోతే మినహా, మీరు నివసించే కౌంటీలో (లేదా పారిష్) మధ్యవర్తిత్వం నిర్వహించబడుతుంది. AAA నియమాలకు అనుగుణంగా ఏదైనా AAA దాఖలు, నిర్వాహక మరియు మధ్యవర్తిత్వ రుసుములను చెల్లించాల్సిన బాధ్యత ప్రతి పక్షంపై ఉంటుంది, అవి తప్ప నష్టాలకు సంబంధించిన మీ దావా $ 75,000 మించకపోతే మరియు పనికిరానిది (ఫెడరల్ రూల్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 11(బి)లో పేర్కొన్నటువంటి ప్రమాణాల ప్రకారం అంచనా వేస్తారు) అయితే, Pinterest మీ సహేతుకమైన దాఖలు, నిర్వాహక మరియు మధ్యవర్తిత్వ రుసుములను చెల్లిస్తుంది. మీ దావా $10,000 లేదా అంతకంటే తక్కువ కోసం అయితే, టెలిఫోన్ సంభాషణ ద్వారా లేదా AAA నియమాల ప్రకారం నియమితులైన వ్యక్తి విచారణ ద్వారా కేవలం మధ్యవర్తికి సమర్పించిన పత్రాల ఆధారంగా మధ్యవర్తిత్వం జరగాలా లేదా అనేదాన్ని మీరు ఎంచుకోవచ్చని మేము అంగీకరిస్తున్నాము. మీ దావా $ 10,000 మించినట్లయితే, విచారణ హక్కు AAA నియమాల ప్రకారం నిర్ణయించబడుతుంది. మధ్యవర్తిత్వం నిర్వహించిన విధానంతో సంబంధం లేకుండా, తీర్పు అందించడానికి ఆధారితమైనటువంటి కనుగొన్న ముఖ్యమైన అంశాలు మరియు తుది నిర్ణయాలను వివరిస్తూ సహేతుకమైన వ్రాతపూర్వక నిర్ణయాన్ని మధ్యవర్తి మంజూరు చేయాలి, అలాగే మధ్యవర్తి అందించే తీర్పుపై ఏదైనా నిర్ణయాన్ని ఏదైనా సమర్థ న్యాయస్థానంలో నమోదు చేయవచ్చు. డేటా భద్రత, మేధో సంపత్తి లేదా సేవకు అనధికార యాక్సెస్ వంటి విషయాలతో సహా న్యాయస్థానాల నుండి నిషేధం లేదా దానికి సమానమైన ఇతర పరిష్కారం పొందకుండా ఏ పక్షాన్ని ఈ విభాగంలో పేర్కొన్న ఏదీ నిరోధించదు. అన్ని దావాలు తప్పనిసరిగా పక్షాల యొక్క వ్యక్తిగత సామర్థ్యంలో దాఖలు చేసి ఉండాలి, అలాగే ఏదైనా ఉద్దేశించిన క్లాస్ లేదా ప్రాతినిధ్య విచారణలో దావా దాఖలు చేసిన వ్యక్తిగా లేదా క్లాస్ సభ్యుడిగా ఉండకూడదు, అలాగే మేము అంగీకరిస్తే మినహా, మధ్యవర్తి ఒక వ్యక్తికి చెందిన దావాలకు మించి సమగ్రపరచకపోవచ్చు. ఈ నిబంధనలలో ప్రవేశించడం ద్వారా, మీరు మరియు PINTEREST ఇద్దరూ ధర్మాసన విచారణను కోరే లేదా క్లాస్ యాక్షన్‌లో పాల్గొనే హక్కును వదులుకుంటున్నట్లు మీరు అంగీకరిస్తున్నారు.

ఈ సేవా నిబంధనలలో ఏదీ మీకు వర్తించేటటువంటి పరిత్యజించలేని ఏవైనా చట్టబద్ధమైన హక్కులను ప్రభావితం చేయదు. Pinterest లేదా మా సేవకు సంబంధించి ఏదైనా దావా, వైరుధ్యం లేదా వివాదం అనేది వర్తించే చట్టాల క్రింద మధ్యవర్తిత్వం చేయదగినది కానంత పరిధి మేరకు: Pinterestకి సంబంధించిన ఏదైనా దావా లేదా వైరుధ్యం ఈ నిబంధనలలోని విభాగం 12 ప్రకారం ప్రత్యేకంగా పరిష్కరించబడుతుందని మీరు మరియు Pinterest ఇద్దరూ అంగీకరిస్తున్నారు.

మీరు EEAలో ఉంటున్న వినియోగదారు అయితే, విభాగం 11 మీకు వర్తించదు. 

 

12. పాలక చట్టం మరియు అధికార పరిధి

ఈ నిబంధనలు కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాల ద్వారా నిర్వహించబడతాయి, దాని చట్ట సూత్రాల వైరుధ్యంతో ఎలాంటి సంబంధం లేదు. మీరు EEAలో ఉంటున్న వినియోగదారు కాకపోతే, ఈ ఒప్పందం నుండి లేదా దీనికి సంబంధితంగా తలెత్తే అన్ని వివాదాలకు ప్రత్యేక అధికార పరిధి అనేది శాన్ ఫ్రాన్సిస్కో కౌంటీ, కాలిఫోర్నియా లేదా కాలిఫోర్నియా ఉత్తర జిల్లా యొక్క యునైటెడ్ స్టేట్స్ జిల్లా న్యాయస్థానం మరియు మా వివాదం కాలిఫోర్నియా చట్టం ప్రకారం నిర్ణయించబడుతుంది.

మీరు EEAలో ఉంటున్న వినియోగదారు అయితే, ఇది మీరు నివసించే దేశ చట్టం ప్రకారం మీకు ఉన్న రక్షణను మరియు ఆ దేశంలోని న్యాయస్థానాలకు యాక్సెస్‌ను మీరు కోల్పోయేలా చేయదు. 

 

మరింత సరళంగా చెప్పాలంటే

సంవత్సరంలోని ఈ వ్యవధిలో బే ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది. సంవత్సరంలో ఏ వ్యవధి అయినా సరే, అది అద్భుతంగానే ఉంటుంది! ఏదేమైనా, మీరు మాపై కేసును ఇక్కడే దాఖలు చేయాలి. 

EEAలో, మీరు వ్యాపారి అయితే ఇది వర్తిస్తుంది, కానీ మీరు వినియోగదారు అయితే, ఇది వర్తించదు. మీరు EEAలో వ్యాపారి అయితే, మీ స్వస్థలంలోని న్యాయస్థానాలలో మాపై కేసు దాఖలు చేయవచ్చు.

 

13. సాధారణ నిబంధనలు
నోటిఫికేషన్ పద్ధతులు మరియు ఈ నిబంధనలకు మార్పులు

మీకు నోటిఫికేషన్‌లను అందించే రూపం మరియు మార్గాలను నిర్ణయించే హక్కు మాకు ఉంది, అలాగే మేము నిర్ణయించినట్లయితే ఎలక్ట్రానిక్ విధానంలో చట్టపరమైన నోటీసులను స్వీకరించడానికి మీరు అంగీకరించాలి. మేము ఎప్పటికప్పుడు ఈ నిబంధనలను సవరించవచ్చు మరియు ప్రస్తుత సంస్కరణ మా వెబ్‌సైట్‌లో ఎల్లప్పుడూ పోస్ట్ చేయబడి ఉంటుంది. మా అభీష్టానుసారం పునర్విమర్శ ముఖ్యమైతే, మేము మీకు తెలియజేస్తాము. పునర్విమర్శలు అమలులోకి వచ్చిన తర్వాత మీరు Pinterestని యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం కొనసాగించడం ద్వారా, మీరు కొత్త నిబంధనలకు కట్టుబడి ఉండటానికి అంగీకరిస్తున్నారు. మీరు క్రొత్త నిబంధనలను అంగీకరించకపోతే, దయచేసి Pinterest ఉపయోగించడం ఆపండి.

మరింత సరళంగా చెప్పాలంటే

మేము నిబంధనలలో పెద్ద మార్పు చేస్తున్నట్లయితే, మేము మీకు తెలియజేస్తాము. మీకు కొత్త నిబంధనలు నచ్చకపోతే, దయచేసి Pinterest ఉపయోగించడం ఆపివేయండి.

కేటాయింపు

ఈ నిబంధనలు మరియు ఇక్కడ మంజూరు చేయబడిన ఏవైనా హక్కులు మరియు లైసెన్స్‌లు మీ ద్వారా బదిలీ చేయబడకపోవచ్చు లేదా కేటాయించబడకపోవచ్చు, కానీ ఎలాంటి పరిమితి లేకుండా Pinterest ద్వారా కేటాయించబడవచ్చు. ఇందుకు సంబంధించి ఉల్లంఘిస్తున్నట్లుగా ఏదైనా బదిలీ లేదా కేటాయింపు చేయడానికి ప్రయత్నిస్తే, అది శూన్యంగా పరిగణించబడుతుంది.

మీరు EEAలో ఉంటున్న వినియోగదారు అయితే, మీరు లేదా Pinterest ఈ ఒప్పందాన్ని మరియు దాని క్రింద మంజూరు చేయబడిన ఏవైనా హక్కులు మరియు లైసెన్స్‌లను మూడవ పక్షానికి కేటాయించవచ్చు. Pinterest ద్వారా అటువంటి కేటాయింపు జరిగే పక్షంలో, మీ ఖాతాను నిష్క్రియం చేయడం ద్వారా వెంటనే ఒప్పందంతో రద్దు చేసుకునే అధికారం మీకు ఉంటుంది. అటువంటి కేటాయింపుకు సంబంధించి Pinterest మీకు సహేతుకమైన నోటీసును అందిస్తుంది.

మొత్తం ఒప్పందం / వేరు చేయగల సామర్థ్యం

ఈ నిబంధనలు, గోప్యతా విధానం మరియు ఏవైనా సవరణలు మరియు మీరు Pinterestతో కుదుర్చుకున్న ఏవైనా అదనపు ఒప్పందాలతో పాటు, సేవకు సంబంధించి మీకు మరియు Pinterestకి మధ్య ఉన్న మొత్తం ఒప్పందాన్ని కలిగి ఉంటాయి. ఈ నిబంధనలలో ఏదైనా నియమం చెల్లదని భావించినట్లయితే, ఆ నియమం అవసరమైన కనీస పరిధి మేరకు పరిమితం చేయబడుతుంది లేదా తొలగించబడుతుంది, అలాగే ఈ నిబంధనలలోని మిగిలిన నియమాలు పూర్తి స్థాయిలో అమలులో ఉంటాయి.

మాఫీ లేదు

ఈ నిబంధనలలో ఏదైనా నిబంధనను మాఫీ చేయడం అనేది ఆ నిబంధన లేదా ఏదైనా ఇతర నిబంధనను తదుపరిగా లేదా నిరంతరంగా మాఫీ చేస్తున్నట్లు పరిగణించబడదు, అలాగే ఈ నిబంధనలలో ఏదైనా హక్కు లేదా నియమాన్ని నొక్కి చెప్పడంలో Pinterest విఫలమైతే, ఆ హక్కు లేదా నియమం మాఫీ చేయబడినట్లు పరిగణించకూడదు.

పక్షాలు

మీరు యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నట్లయితే, ఈ నిబంధనలు మీకు మరియు Pinterest Inc., 651 బ్రాన్నన్ స్ట్రీట్, శాన్ ఫ్రాన్సిస్కో, CA 94103 మధ్య ఒప్పందంగా పరిగణించబడతాయి. మీరు యునైటెడ్ స్టేట్స్ వెలుపల నివసిస్తున్నట్లయితే, ఈ నిబంధనలు మీకు మరియు పామర్‌స్టన్ హౌస్, 2వ అంతస్తు, ఫెనియన్ స్ట్రీట్, డబ్లిన్ 2, ఐర్లాండ్‌లో రిజిస్టర్డ్ కార్యాలయం ఉన్న ఐరిష్ కంపెనీ అయిన Pinterest Europe Ltd. మధ్య ఒప్పందంగా పరిగణించబడతాయి.

మరింత సరళంగా చెప్పాలంటే

మీరు ఎవరితో డీల్ చేస్తారనే అంశం మీరు నివసిస్తున్న ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది.

మే 1, 2018 నుండి అమలులోకి వస్తుంది