కాలిఫోర్నియా నివాసితులు: దయచేసి మా కాలిఫోర్నియా గోప్యతా ప్రకటన మరియు సేకరణ నోటీసును ఇక్కడ చూడండి. 

సహకారాత్మక కొల్లేజ్‌ల కోసం సులభమైన మరియు శక్తివంతమైన సాధనాన్ని మీకు అందించేందుకు Pinterest బృందం Shuffles యాప్‌ను సృష్టించింది. 

మీరు ఇప్పటికే ఉన్న Pinterest ఖాతాతో లాగిన్ చేయడం ద్వారా మాత్రమే Shufflesను ఉపయోగించగలరు, అలాగే మా Pinterest గోప్యతా విధానం Shufflesకు కూడా వర్తిస్తుంది. ఈ Shuffles గోప్యతా నోటీసులో Shufflesకు సంబంధించి మేము సేకరించే మరియు ఉపయోగించే సమాచారం మరియు మీరు Shufflesను ఉపయోగించేటప్పుడు మీకు ఉన్న ఎంపికల గురించి మీరు తెలుసుకోవాలని మేము కోరుకునే కొన్ని అదనపు విషయాలు వివరించబడ్డాయి. 

మా సేవా నిబంధనలులో మేము చేసే వాగ్దానాలను నెరవేర్చడం లేదా మీ సమాచారాన్ని ఉపయోగించడంలో మేము చట్టబద్ధమైన ఆసక్తిని కలిగి ఉన్నప్పుడు వంటి సరైన చట్టపరమైన ప్రాతిపదికను కలిగి ఉన్నప్పుడు మాత్రమే మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తాము. 

మీరు Pinterestలోని మిగిలిన భాగం మాదిరిగానే Shuffles కోసం అదే ప్రొఫైల్‌ను కలిగి ఉన్నారు, కాబట్టి మీ పేరు, అలాగే ప్రొఫైల్ ఫోటో వంటి కొంత Pinterest ఖాతా సమాచారం Shufflesలో చూపబడుతుంది.  Pinterestలో మీరు ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తులు Shufflesలో చేరినప్పుడు, కనెక్ట్ కావడంలో మీకు సహాయపడతాము. 

Shufflesలో మీ అనుభవాన్ని మెరుగుపరచడం కోసం Pinterestలోని మీ కార్యకలాపం నుండి మేము కొంత సమాచారాన్ని కూడా ఉపయోగిస్తాము. ఉదాహరణకు, Pinterestలో మీ ప్రొఫైల్‌కు మీరు సేవ్ చేసిన పిన్‌ల ఆధారంగా Shufflesలో కొల్లేజ్‌లను సృష్టించడం కోసం మీరు ఉపయోగించగల పిన్‌లను మేము సిఫార్సు చేస్తాము. Shuffles గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ఇతర విషయాలు ఇక్కడ ఉన్నాయి:

  • ఫోన్ నంబర్‌లు: మీరు Shuffles కోసం సైన్ అప్ చేసినప్పుడు, మీ ఫోన్ నంబర్‌ను అందించాల్సిందిగా మిమ్మల్ని ప్రాంప్ట్ చేస్తాము. Shufflesలో మీరు మరియు మీ స్నేహితులు ఒకరినొకరు కనుగొనడంలో సహాయపడటం కోసం, అలాగే ఖాతా నిర్వహణ మరియు భద్రత కోసం మేము మీ ఫోన్ నంబర్‌ను ఉపయోగిస్తాము.  
  • కాంటాక్ట్‌లు: మీ కాంటాక్ట్‌లకు సంబంధించిన యాక్సెస్‌ను Shufflesకు అందించే ఎంపిక మీకు ఉంటుంది. Shufflesలో మీరు మరియు మీ స్నేహితులు ఒకరినొకరు కనుగొనడంలో సహాయపడటం కోసం, అలాగే Shufflesలో ఇంకా చేరని స్నేహితులను ఆహ్వానించడం కోసం మేము ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాము.
  • కొల్లేజ్‌లు: మీరు కొల్లేజ్‌ను సృష్టించినప్పుడు, దాన్ని ప్రైవేట్‌గా ఉంచడానికి, Shufflesలో ఎంచుకోబడిన స్నేహితులతో షేర్ చేయడానికి లేదా Shufflesలోనే దాన్ని పబ్లిక్‌గా పోస్ట్ చేయడానికి మీరు ఎంపికను కలిగి ఉంటారు. మీరు Shufflesలో కొల్లేజ్‌ను పబ్లిక్‌గా పోస్ట్ చేసినప్పుడు, మీరు మీ సెట్టింగ్‌లలో నిలిపివేస్తే మినహా మీ Pinterest ప్రొఫైల్‌లో కూడా అది పబ్లిక్‌గా పోస్ట్ చేయబడుతుంది. మీరు ఏదైనా కొల్లేజ్‌ను పోస్ట్ చేసిన తర్వాత కూడా దాన్ని తొలగించవచ్చు. మీరు మీ కొల్లేజ్‌ను ఇతరులకు కనిపించేలా చేసినట్లయితే, వారు దానికి కామెంట్‌లు లేదా ప్రతిస్పందనలను జోడించగలరు లేదా దాన్ని తమకు తామే షేర్ చేసుకోగలరు. Shufflesలో మీరు ఉపయోగించడం కోసం ఎంచుకోగల కొన్ని ఇతర సహకార ఫీచర్‌లు ఉన్నాయి. ఉదాహరణకు, మీరు పబ్లిక్ కొల్లేజ్‌కు (ఫోటోలు లేదా కళ వంటి) కంటెంట్‌ను జోడించినట్లయితే, Shufflesను ఉపయోగించే ఇతర వినియోగదారులు వారి కొల్లేజ్‌లలో కూడా ఈ కంటెంట్‌ను ఉపయోగించగలరు. మీరు మీ కొల్లేజ్‌ను షేర్ చేసినట్లయితే, దానికి యాక్సెస్ ఉన్న వినియోగదారులు "రీషఫుల్" సృష్టించగలరు – మీరు వాస్తవంగా సృష్టించిన దాని ఆధారంగా కొత్త కొల్లేజ్.
  • కామెంట్‌లు: మీరు కొల్లేజ్‌పై చేసిన ఏదైనా కామెంట్‌ను తొలగించవచ్చు లేదా సవరించవచ్చు. 
  • Shuffles సందేశాలు: మీరు స్నేహితులతో సందేశం పంపడం కోసం Shufflesను ఉపయోగిస్తే, మీరు ఇక భాగం కాకూడదని కోరుకునే సందేశ థ్రెడ్‌లను వదిలివేయవచ్చు, అలాగే మీరు ఇంటరాక్ట్ కాకూడదని కోరుకునే ఇతర వినియోగదారులను బ్లాక్ చేయవచ్చు. 
  • నోటిఫికేషన్‌లు: Shuffles నుండి పుష్ నోటిఫికేషన్‌లను స్వీకరించాలా వద్దా అనేది మీరు ఎంచుకోవచ్చు. మీరు మొదటిసారి Shufflesను యాక్సెస్ చేసినప్పుడు, వాటిని స్వీకరించాలనుకుంటున్నారేమో అని మిమ్మల్ని అడుగుతారు. మీరు మీ పరికర సెట్టింగ్‌ల మెనులో పుష్ నోటిఫికేషన్‌ల ప్రాధాన్యతలను ఆఫ్ చేయవచ్చు లేదా సర్దుబాటు చేయవచ్చు. మేము ఇమెయిల్ ద్వారా మార్కెటింగ్ మెటీరియల్‌లను మీకు పంపినట్లయితే, ఆ కమ్యూనికేషన్‌లలోని సూచనలను అనుసరించడం ద్వారా మీరు అన్‌సబ్‌స్క్రైబ్ చేయవచ్చు. 
  • ప్రొఫైల్: మీ Pinterest ఖాతాలో Shuffles భాగంగా ఉన్న కారణంగా, Pinterestలో మీరు మీ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసినప్పుడు, Shufflesలో మేము చూపే ఏదైనా ప్రొఫైల్ సమాచారం కూడా అప్‌డేట్ అవుతుంది. మీ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయడం కోసం, దయచేసి మీ Pinterest ఖాతాలో సెట్టింగ్‌ల మెనుని సందర్శించండి. 
  • షేర్ సెట్టింగ్‌లు: మీరు కొల్లేజ్‌ను తొలగించినట్లయితే లేదా Shufflesలో దాన్ని ప్రైవేట్‌గా చేసినట్లయితే, అది మీ Pinterest ప్రొఫైల్ నుండి ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది.  మీరు కొల్లేజ్‌ను తొలగించినట్లయితే లేదా Pinterestలో రహస్య బోర్డుకు తరలించనట్లయితే, అది ఆటోమేటిక్‌గా తొలగించబడదు లేదా Shuffles ప్రైవేట్‌గా చేయబడదు.
  • ఇతర ఖాతా ఎంపికలు: మీ ఖాతా డేటాను యాక్సెస్ చేయడానికి, సవరించడానికి లేదా తొలగించడానికి Pinterest సహాయ కేంద్రాన్ని సందర్శించండి.
  • మీ ఎంపికలకు సంబంధించిన మరింత సమాచారం కోసం, Pinterest గోప్యతా విధానాన్ని సందర్శించండి.