కాలిఫోర్నియా నివాసితులు: దయచేసి మా కాలిఫోర్నియా గోప్యతా ప్రకటన మరియు సేకరణ నోటీసును ఇక్కడ చూడండి. 

మార్పుల సారాంశం

మా కాలిఫోర్నియా గోప్యతా ప్రకటన మరియు సేకరణ నోటీసును జోడించడం ద్వారా మరియు వర్జీనియా చట్టానికి అప్‌డేట్‌లను పరిగణనలోకి తీసుకుని మేము మీకు అందించే కొన్ని ఎంపికలను వివరించడం ద్వారా సహా చట్టంలో మార్పుల ఆధారంగా మా కార్యకలాపాలలో కొన్నింటిని ఎలా వివరిస్తామో మేము అప్‌డేట్ చేసాము.

Pinterest ఉపయోగించినందుకు ధన్యవాదాలు!

ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని నచ్చిన విధంగా మలచుకునేలా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. అలా చేయడానికి, మేము మీ నుండి మరియు మూడవ పక్షాల నుండి సేకరించే సమాచారం ఆధారంగా మీకు ఆసక్తి ఉంటుందని మేము భావించే వ్యక్తిగతీకరించిన కంటెంట్ మరియు ప్రకటనలను మీకు చూపుతాము. మేము అలా చేయడానికి సరైన చట్టబద్ధమైన ప్రాతిపదిక ఉన్న చోట మాత్రమే ఆ సమాచారాన్ని ఉపయోగిస్తాము.



మేము ఏ సమాచారాన్ని సేకరిస్తాము, మేము దాన్ని ఎలా ఉపయోగిస్తాము మరియు దానికి సంబంధించి మీకు ఉన్న ఎంపికల గురించి అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి మేము ఈ విధానాన్ని వ్రాసాము. మేము ఇంటర్నెట్ కంపెనీ అయినందున, క్రింది వాటిలో కొన్ని అంశాలు కొద్దిగా సాంకేతికపరంగా ఉన్నప్పటికీ మేము విషయాలను సరళంగా మరియు స్పష్టంగా వివరించడానికి మా వంతు ప్రయత్నం చేసాము. ఈ విధానంపై మీకు ఉండే ప్రశ్నలు మరియు వ్యాఖ్యలను మేము స్వాగతిస్తున్నాము.

మేము కొన్ని వివిధ మార్గాలలో సమాచారాన్ని సేకరిస్తాము
1. మీరు దానిని మాకు ఇచ్చినప్పుడు లేదా దాన్ని పొందటానికి మాకు అనుమతి ఇచ్చినప్పుడు

మీరు Pinterest కోసం సైన్ అప్ చేసినప్పుడు లేదా దాన్ని ఉపయోగించినప్పుడు, మీ పేరు, ఇమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్, ఫోటోలు, పిన్‌లు, వ్యాఖ్యలు మరియు మీరు మాకు ఇచ్చే ఏదైనా ఇతర సమాచారంతో సహా నిర్దిష్ట సమాచారాన్ని స్వచ్ఛందంగా భాగస్వామ్యం చేస్తారు. అలాగే మీరు మీ పరికర సెట్టింగ్‌లను ఉపయోగించి లేదా ఫోటోల ద్వారా మీ ఖచ్చితమైన స్థానాన్ని భాగస్వామ్యం చేయడానికి ఎంచుకోవచ్చు. మీరు మీ ఖచ్చితమైన స్థానాన్ని భాగస్వామ్యం చేయడానికి ఎంచుకోకపోయినప్పటికీ, మేము మీ IP చిరునామాను ఉపయోగిస్తాము, ఇది మీ స్థానాన్ని అంచనా వేయడానికి ఉపయోగించబడుతుంది. మీ లింగం, వయస్సు మరియు ప్రాధాన్య భాష వంటి మీకు సంబంధించిన ఇతర సమాచారాన్ని భాగస్వామ్యం చేసే ఎంపిక కూడా మీకు ఉంటుంది.

    

మీరు మీ Facebook, Google లేదా ఇతర మూడవ పక్షాన్ని Pinterestకి కనెక్ట్ చేసినట్లయితే, మేము మీ Pinterest అనుభవాన్ని మెరుగుపరచడానికి ఆ ఖాతాల (మీ స్నేహితులు లేదా పరిచయాల వంటివి) నుండి సమాచారాన్ని ఉపయోగిస్తాము. ఇది ఆ ఖాతాల యొక్క గోప్యతా విధానాలు లేదా సెట్టింగ్‌లపై ఆధారపడి ఉంటుంది.

2. మీరు Pinterest ఉపయోగించినప్పుడు మాకు సాంకేతిక సమాచారం కూడా అందుతుంది

మీరు వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్ లేదా ఇతర ఇంటర్నెట్ సేవను ఉపయోగించినప్పుడు, నిర్దిష్ట ఇంటర్నెట్ మరియు ఎలక్ట్రానిక్ నెట్‌వర్క్ కార్యాచరణ సమాచారం స్వయంచాలకంగా సృష్టించబడుతుంది మరియు లాగ్ చేయబడుతుంది. మీరు Pinterest ఉపయోగించినప్పుడు ఇది కూడా వాస్తవం. మేము సేకరించే సమాచార రకాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి:

  • లాగ్ డేటా. మీరు Pinterestను ఉపయోగించినప్పుడు, మా సర్వర్‌​లు మీరు వెబ్​‌​సైట్‌​ను సందర్శించినప్పుడు మీ బ్రౌజర్ స్వయంచాలకంగా పంపే సమాచారం లేదా మీరు ఉపయోగిస్తున్నప్పుడు మీ మొబైల్ యాప్ స్వయంచాలకంగా పంపే సమాచారంతో సహా సమాచారాన్ని (“లాగ్ డేటా”) రికార్డ్ చేస్తాయి. ఈ లాగ్ డేటాలో మీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ చిరునామా (మీ ఇంచుమించు స్థానాన్ని అంచనా వేయడానికి మేము ఉపయోగించేది), Pinterest ఫీచర్‌లను (“సేవ్ చేయి” బటన్ వంటివి​—దిగువ మరిన్ని వివరాలు చూడండి) కలిగి ఉండేటటువంటి మీరు సందర్శించే వెబ్‌​సైట్‌ల చిరునామా మరియు వాటిలోని కార్యకలాపాలు, శోధనలు, బ్రౌజర్ రకం మరియు సెట్టింగ్‌లు, మీ అభ్యర్థన తేదీ మరియు సమయం, మీరు Pinterestను ఉపయోగించిన విధానం, కుక్కీ డేటా మరియు పరికర డేటా ఉంటాయి. మీరు మేము ఇక్కడ సేకరించే లాగ్ డేటా గురించి మరింత తెలుసుకోవచ్చు .
  • కుక్కీ డేటా. అలాగే మేము లాగ్ డేటాను పొందడానికి “కుక్కీలు” (మీరు మా వెబ్​zwnj​సైట్​zwnj​ను సందర్శించే ప్రతిసారీ మీ కంప్యూటర్ పంపే చిన్న టెక్స్ట్ ఫైల్‌లు, మీ Pinterest ఖాతా లేదా మీ బ్రౌజర్​zwnj​కు ప్రత్యేకమైనవి) లేదా ఇటువంటి సాంకేతికతలను ఉపయోగిస్తాము. మేము కుకీలు లేదా ఇతర సారూప్య సాంకేతికతలను ఉపయోగించేటప్పుడు, సెషన్ కుక్కీలు (మీ బ్రౌజర్‌ను మూసివేసే వరకు ఉంటాయి) లేదా నిరంతర కుక్కీలను (మీరు లేదా మీ బ్రౌజర్ వాటిని తొలగించే వరకు ఉంటాయి) ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీ భాషా ప్రాధాన్యతలు లేదా ఇతర సెట్టింగ్‌లను నిల్వ చేయడానికి మేము కుక్కీలను ఉపయోగిస్తాము, కాబట్టి మీరు Pinterestని సందర్శించే ప్రతిసారీ వాటిని సెటప్ చేయవలసిన అవసరం లేదు. మేము ఉపయోగించే కొన్ని కుక్కీలు మీ Pinterest ఖాతాతో అనుబంధించబడి ఉంటాయి (మీరు మాకు అందించిన ఇమెయిల్ చిరునామా వంటి మీకు సంబంధించిన సమాచారంతో సహా) మరియు ఇతర కుక్కీలు ఉండవు. మేము కుక్కీలను ఎలా ఉపయోగిస్తామనే దానిపై మరింత వివరణాత్మక సమాచారం కోసం, దయచేసి మా కుక్కీ విధానాన్ని సమీక్షించండి.
  • పరికర సమాచారం. లాగ్ డేటాతో పాటు, మీరు Pinterestను ఉపయోగిస్తున్న పరికరానికి సంబంధించి పరికర రకం, ఆపరేటింగ్ సిస్టమ్, సెట్టింగ్‌లు, ప్రత్యేక పరికర ఐడెంటిఫైయర్‌​లు మరియు ఏదైనా అవాంతరం ఏర్పడినప్పుడు అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడే క్రాష్ డేటా వంటి సమాచారాన్ని సేకరిస్తాము.
  • క్లిక్ స్ట్రీమ్ డేటా మరియు అంచనాలు. మీరు Pinterestలో ఉన్నప్పుడు, మీరు క్లిక్ చేసే పిన్‌లు, మీరు సృష్టించే బోర్డుల వంటి మీ కార్యాచరణ మరియు మీరు వ్యాఖ్య లేదా వివరణలో జోడించే ఏదైనా వచనం, అలాగే మీరు మొదట సైన్ అప్ చేసినప్పుడు అందించిన సమాచారం మరియు మీ గురించి మరియు మీ ప్రాధాన్యతల గురించి అంచనా వేయడానికి మా భాగస్వాములు మరియు ప్రకటనదారుల నుండి సమాచారాన్ని మేము ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీరు ప్రయాణం గురించి బోర్డును సృష్టిస్తే, మీకు ప్రయాణాల పట్ల ఆసక్తి ఉందని మేము అంచనా వేయవచ్చు. మీరు Facebook లేదా Google వంటి మూడవ పక్షాలతో కలిగి ఉన్న ఖాతాలకు మీ ఖాతాను లింక్ చేసినప్పుడు మీ కార్యాచరణ ఆధారంగా మీ విద్య లేదా వృత్తిపరమైన అనుభవానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మేము అంచనా వేయవచ్చు.
  • 3. మా భాగస్వాములు మరియు ప్రకటనదారులు మాతో సమాచారాన్ని భాగస్వామ్యం చేస్తారు

    అలాగే మేము మా అనుబంధ సంస్థలు, ప్రకటనదారులు, భాగస్వాములు మరియు మేము కలిసి పని చేసే ఇతర మూడవ పక్షాల నుండి మీ గురించి మరియు Pinterest వెలుపల మీ కార్యాచరణ గురించి సమాచారాన్ని పొందుతాము. ఉదాహరణకు:

  • కొన్ని వెబ్‌సైట్‌లు లేదా యాప్‌లు మా “సేవ్” బటన్ వంటి Pinterest ఫీచర్‌లను ఉపయోగిస్తాయి లేదా మీరు మీ బ్రౌజర్ కోసం మా “సేవ్” బటన్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు. అలా చేసినట్లయితే, మేము ఆ సైట్‌లు లేదా యాప్‌ల నుండి లాగ్ డేటాను సేకరిస్తాము. మీరు మా సహాయ కేంద్రంలో ఈ ఫీచర్‌ల గురించి మరింత తెలుసుకోవచ్చు.
  • ఆన్‌​లైన్ ప్రకటనదారులు లేదా మూడవ పక్షాలు Pinterestలో ప్రకటనల పనితీరును కొలవడానికి, నివేదించడానికి లేదా మెరుగుపరచడానికి లేదంటే Pinterestలో లేదా వెలుపల మీకు ఏ విధమైన ప్రకటనలను చూపించాలో తెలుసుకోవడానికి మాతో సమాచారాన్ని భాగస్వామ్యం చేస్తాయి. ప్రకటనదారుల సైట్​‌​కు మీ సందర్శనలు లేదా మీరు వారి నుండి చేసిన కొనుగోళ్ల గురించి లేదంటే మీకు ప్రకటనలను చూపడంలో సహాయపడటానికి మేము ఉపయోగించే మూడవ పక్షం సేవ నుండి మీ ఆసక్తులకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది.

    సమాచార ప్రకటనదారులు లేదా ఇతర మూడవ పక్షాలు మాతో భాగస్వామ్యం చేసే సమాచార రకాల గురించి మరింత తెలుసుకోండి.
  • మీ గోప్యత మరియు డేటా సెట్టింగ్‌లలో మీ అనుభవం మరియు మీరు Pinterestలో చూసే ప్రకటనలను వ్యక్తిగతీకరించడానికి మేము ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తామో మీరు నియంత్రించవచ్చు. 

    మేము సేకరించే సమాచారంతో ఏమి చేస్తాము
    మీకు సంబంధితంగా, ఆసక్తికరంగా మరియు వ్యక్తిగతంగా ఉండే కంటెంట్‌ను మీకు చూపడానికి మేము కట్టుబడి ఉన్నాము. అలా చేయడానికి, క్రింది అంశాలతో సహా మీ అనుభవాన్ని అందించడానికి మరియు మెరుగుపరచడానికి మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తాము:
  • మీరు Pinterest ఉపయోగించినప్పుడు మిమ్మల్ని గుర్తించడం.
  • Pinterestలో మీ కార్యాచరణ ఆధారంగా మీరు ఇష్టపడే పిన్‌లు, బోర్డులు, విషయాలు లేదా వర్గాలను సిఫార్సు చేయడం. ఉదాహరణకు, మీరు వంటపై ఆసక్తి చూపినట్లయితే, మీరు ఇష్టపడతారని మేము భావించే ఆహార సంబంధిత పిన్‌లు, బోర్డులు లేదా వ్యక్తులను సూచించవచ్చు లేదా మీకు ఆహార సంబంధిత ప్రకటనలను చూపవచ్చు.
  • మీ ప్రశ్నలకు లేదా వ్యాఖ్యలకు ప్రతిస్పందించడం.
  • మీ సమాచారాన్ని ఈ మార్గాల్లో ఉపయోగించడానికి మాకు చట్టబద్ధమైన ఆసక్తి ఉంది. ఇది Pinterestలో మేము చేసే అంశాలకు ప్రాథమికమైనది, అలాగే Pinterest మరియు దాని ఫీచర్‌లను మీకు సంబంధితంగా మరియు వ్యక్తిగతీకరించడానికి అవసరమైనది.

    అలాగే Pinterestను సురక్షితంగా తీర్చిదిద్దడానికి మరియు మా ఉత్పత్తి ఫీచర్‌లను మెరుగుపరచడంలో మాకు చట్టబద్ధమైన ఆసక్తి ఉంది, కాబట్టి మీకు అవసరమైన ప్రేరణను మీరు పొందుతూ ఉంటారు. మేము మీ సమాచారాన్ని క్రింది అంశాల కోసం ఉపయోగించినప్పుడు మనందరికీ ప్రయోజనం చేకూరుతుంది:

  • ఇలాంటి ఆసక్తులు ఉన్న ఇతర వ్యక్తులను సూచించడం. ఉదాహరణకు, మీరు ఇంటీరియర్ డిజైన్ బోర్డులను అనుసరిస్తే, మీకు నచ్చే ఇంటీరియర్ డిజైనర్‌లను మేము సూచించవచ్చు.
  • Pinterest లో మిమ్మల్ని కనుగొనడానికి మీ స్నేహితులు మరియు పరిచయాలు సహాయం చేయండి. ఉదాహరణకు, మీరు Facebook ఖాతాను ఉపయోగించి సైన్ అప్ చేస్తే, మీ Facebook స్నేహితులు మొదట Pinterest కోసం సైన్ అప్ చేసుకునేటప్పుడు Pinterestలో మిమ్మల్ని కనుగొనడంలో మేము వారికి సహాయపడవచ్చు. లేదా వ్యక్తులు మీ ఇమెయిల్‌ను ఉపయోగించి Pinterestలో మీ ఖాతా కోసం శోధించవచ్చు.
  • చట్ట పరిరక్షణ సంస్థలతో కలిసి పని చేయడం మరియు Pinterestను సురక్షితంగా ఉంచడం. పోలీసులు లేదా న్యాయస్థానాల వంటి చట్ట పరిరక్షణ అధికారుల నుండి ఖాతా సమాచారం కోరుతూ అభ్యర్థనలను మేము పొందవచ్చు. చట్ట పరిరక్షణ సంస్థల అభ్యర్థనలకు మేము ఎలా ప్రతిస్పందిస్తామనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి మా చట్ట పరిరక్షణ సంస్థ మార్గదర్శకాలను చూడండి.
  • మీ భద్రత, మా కమ్యూనిటీ మరియు/లేదా పబ్లిక్ సభ్యుల భద్రతకు ప్రమాదం కలిగించే కార్యాచరణను గుర్తించడానికి Pinterestలో మీ సందేశాలను సమీక్షించండి.
  • Pinterestను ఎవరు ఉపయోగిస్తున్నారు మరియు వారు ఏమి చేస్తున్నారు అనే అంశాలపై విశ్లేషణలు మరియు పరిశోధనలు నిర్వహించడం. ఉదాహరణకు, Pinterestలో వ్యక్తులు రెండు వేర్వేరు సంస్కరణలను ఎంత తరచుగా ఉపయోగిస్తున్నారో లాగ్ చేయడం ద్వారా, ఏ సంస్కరణ మంచిదో మనం అర్థం చేసుకోవచ్చు.
  • Pinterestను మెరుగుపరచండి మరియు కొత్త ఫీచర్‌లను అందించడం.
  • ఇతర సైట్‌లలో మీకు Pinterest ఉత్పత్తులు మరియు సేవలను అడ్వర్టయిజ్ చేయడం. మీరు ఇక్కడ పేర్కొన్న సూచనలను అనుసరించడం ద్వారా ఆ ప్రకటనలను వ్యక్తిగతీకరించడానికి మేము మీ సమాచారాన్ని ఇతర సైట్​లతో భాగస్వామ్యం చేయకూడదని మీరు ఎంచుకోవచ్చు. అలాగే మీరు క్రింద "మీ ఎంపికలు" విభాగంలో మరింత తెలుసుకోవచ్చు.
  • మీ సెట్టింగ్‌ల ఆధారంగా మీకు తాజా వార్తావిశేషాలు (సేవ్ చేయడాలు లేదా వ్యాఖ్యలు వంటి నిర్దిష్ట కార్యాచరణ Pinterestలో జరిగినప్పుడు) మరియు వార్తలను ఇమెయిల్ లేదా పుష్ నోటిఫికేషన్ ద్వారా పంపడం. ఉదాహరణకు, మీకు నచ్చే పిన్‌లకు సంబంధించిన వారపు వార్తావిశేషాలను మేము పంపుతాము. మీరు ఈ నోటిఫికేషన్‌లను పొందడం ఆపివేసేలా మీ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయడం ద్వారా నిర్ణయించుకోవచ్చు.
  • ఆదాయాన్ని సంపాదించడం కోసం మీకు సంబంధితంగా, ఆసక్తికరంగా మరియు వ్యక్తిగతంగా ఉండే ప్రకటనలను చూపడంలో మాకు చట్టబద్ధమైన ఆసక్తి ఉంది. ఈ ఆసక్తులను మరింత పెంచడానికి, మేము సేకరించే సమాచారాన్ని క్రింది అంశాల కోసం ఉపయోగిస్తాము:

  • మీకు ఏ ప్రకటనలను చూపాలో నిర్ణయించడం. ఉదాహరణకు, మీరు Pinterestలో క్యాంపింగ్ టెంట్‌లపై ఆసక్తి చూపితే, ఇతర అవుట్‌డోర్ ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలను మేము మీకు చూపవచ్చు. మీ ఆన్‌సైట్ మరియు ఆఫ్‌సైట్ కార్యకలాపాల ఆధారంగా మీ ఆసక్తులను గుర్తించడం ద్వారా, అలాగే ప్రకటన భాగస్వాములు లేదా ఇతర మూడవ పక్షాల నుండి మేము అందుకున్న సమాచారాన్ని ఉపయోగించడం ద్వారా మేము మీకు చూపే ప్రకటన కంటెంట్‌ను అనుకూలీకరిస్తాము. మీ ఆఫ్‌సైట్ ఆసక్తులను గుర్తించడానికి మేము కుక్కీలను ఉపయోగించే సందర్భాలలో, మేము అవసరమైన చోట మీ సమ్మతిని పొందుతాము. ప్రకటన భాగస్వాములు లేదా ఇతర మూడవ పక్షాలు మీకు సంబంధించిన సమాచారాన్ని మాతో భాగస్వామ్యం చేసే సందర్భాలలో, వారు ఇప్పటికే పొందిన సమ్మతిపై మేము ఆధారపడతాము.
  • మా ప్రకటన భాగస్వాములకు వారి Pinterest ప్రకటనలు ఎలా చూపబడుతున్నాయో మరియు వాటిని ఎలా మెరుగుపరుచుకోవాలో చెప్పండి. ఈ సమాచారంలో కొంత భాగం సమగ్రపరచబడింది. ఉదాహరణకు, ప్రమోట్ చేసిన పిన్‌ను చూసిన నిర్దిష్ట శాతం మంది వ్యక్తులు ఆ ప్రకటనదారు సైట్‌ను సందర్శించడానికి మళ్లించబడ్డారని మేము ప్రకటనదారుకు నివేదిస్తాము. మీరు నివసిస్తున్న ప్రదేశం మరియు మీ సెట్టింగ్‌ల ఆధారంగా, మేము ఈ సమాచారాన్ని వ్యక్తిగత స్థాయిలో కూడా వెల్లడించవచ్చు; ఈ సమాచారం సమగ్రపరచబడలేదు. ఉదాహరణకు, నిర్దిష్ట ప్రమోట్ చేయబడిన పిన్‌ను కొంతమంది వ్యక్తులు సేవ్ చేసినట్లు మేము ప్రకటనదారుకు తెలియజేస్తాము. ప్రకటనలపై నివేదించడం గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి సహాయ కేంద్రాన్ని సందర్శించండి .
  • మీ ఆఫ్‌సైట్ ప్రవర్తన ఆధారంగా మీ Pinterest అనుభవాన్ని అనుకూలీకరించడానికి మేము సేకరించే సమాచారాన్ని ఉపయోగించడంలో మాకు చట్టబద్ధమైన ఆసక్తి ఉంది. ఉదాహరణకు, మీరు ఎలక్ట్రిక్ గిటార్‌లను విక్రయించే వెబ్‌సైట్‌లను సందర్శించినట్లయితే, మేము మీకు గిటార్ పిన్‌లను సూచించవచ్చు. మేము కుక్కీలతో మీ ఆఫ్‌సైట్ ఆధారంగా మీ ఆసక్తులను గుర్తించినప్పుడు, మేము (లేదా మా భాగస్వాములు) మాకు అవసరమైన ఏదైనా సమ్మతిని పొందుతాము. మేము కుక్కీలను ఎలా ఉపయోగిస్తామనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి మా కుక్కీ విధానాన్ని చూడండి.

    పైన పేర్కొన్న నిర్దిష్ట పరిస్థితులతో పాటు, మేము మీ సమాచారాన్ని క్రింది అంశాల కోసం మీ సమ్మతితో మాత్రమే ఉపయోగిస్తాము:

  • ఫోటోలతో శోధించడానికి అనుమతించడం. ఉదాహరణకు, మీరు బూట్ల జత లేదా మీకు నచ్చిన గృహోపకరణం ఫోటోను తీస్తే, సారూప్య వస్తువులను మీకు చూపించమని మీరు మమ్మల్ని అడగవచ్చు. మీరు మీ పరికర ఆపరేటింగ్ సిస్టమ్ సెట్టింగ్‌లలో దీన్ని ప్రారంభించవచ్చు.
  • మీ ఖాతా లేదా ఆపరేటింగ్ సిస్టమ్ సెట్టింగ్‌లను బట్టి మీకు ఇమెయిల్, సందేశం, పుష్ నోటిఫికేషన్ లేదా ఫోన్ కాల్ ద్వారా మార్కెటింగ్ అంశాలను పంపడం. మేము మీకు మార్కెటింగ్ అంశాలను పంపే ప్రతిసారీ, అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకునే అవకాశాన్ని మీకు అందిస్తాము.
  • మీ ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించండి మరియు మేము మీకు చూపించే సిఫార్సులు మరియు ప్రకటనలను అనుకూలీకరించండి. ఉదాహరణకు, మీరు రీటైలర్ దగ్గర ఉన్నట్లు మాకు తెలిస్తే, మీకు ఆసక్తి ఉండేటటువంటి ఆ రీటైలర్ పిన్‌లను మేము మీకు చూపవచ్చు. మీరు మీ పరికర ఆపరేటింగ్ సిస్టమ్ సెట్టింగ్‌లలో దీన్ని ప్రారంభించవచ్చు.
  • మీరు నివసిస్తున్న ప్రదేశం మరియు మీ సెట్టింగ్‌ల ఆధారంగా, Pinterest ట్యాగ్ ఉపయోగించి వారి ప్రకటనల పనితీరు ఎలా ఉందో మా ప్రకటన భాగస్వాములకు చెప్పండి. Pinterest ట్యాగ్ (ప్రకటనదారు వారి సైట్‌లో ఉంచే కోడ్ భాగం) అనేది Pinterestలో ప్రకటనను చూసిన తర్వాత వ్యక్తి వారి వెబ్‌సైట్‌లో తీసుకునే చర్యల గురించి మాకు మరియు మా ప్రకటన భాగస్వాములకు అంతర్దృష్టులను అందిస్తుంది. Pinterest ట్యాగ్ గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి సహాయ కేంద్రాన్ని సందర్శించండి .
  • అవసరమైన చోట, మీకు ఆసక్తి ఉండే ప్రకటనలను మీకు చూపడానికి మేము కుక్కీలను ఉపయోగించే సందర్భంలో మీ సమ్మతిపై కూడా మేము ఆధారపడతాము. మీ ఆఫ్‌సైట్ కార్యాచరణ ఆధారంగా మీ ఆసక్తులను గుర్తించడానికి మేము కుక్కీలను ఉపయోగిస్తాము. ప్రస్తుతం Pinterest ఉపయోగిస్తున్న వ్యక్తుల కోసం మరియు కొత్త వ్యక్తుల కోసం దీన్ని చేస్తాము, మీరు Pinterestలో ఎలా ప్రారంభించాలో అనుకూలీకరించడానికి ఇది మాకు సహాయపడుతుంది.

    మేము కుక్కీలను ఎలా ఉపయోగిస్తాము, అలాగే మేము వాటిని ఎలా ఉపయోగించాలనే దానికి సంబంధించిన మీ ఎంపికల గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి మా కుక్కీ విధానాన్ని చూడండి.

    మీ సమాచారాన్ని బదిలీ చేయడం

    Pinterest అనేది ప్రపంచవ్యాప్త సేవ. మా ఉత్పత్తులు లేదా సేవలను ఉపయోగించడం ద్వారా, ఈ విధానంలో వివరించిన ప్రయోజనాల కోసం మీ సమాచారాన్ని యునైటెడ్ స్టేట్స్‌తో సహా మీ స్వదేశానికి వెలుపల బదిలీ చేయడానికి మరియు నిల్వ చేయడానికి మీరు మాకు అధికారం ఇస్తున్నారు. అటువంటి దేశాలలో మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి గోప్యతా రక్షణలు మరియు అధికారుల హక్కులు మీ స్వదేశంలో ఉన్న వాటికి సమానంగా ఉండకపోవచ్చు.

    ఆ ప్రాంతానికి మరియు దాని నుండి డేటా బదిలీల గురించి మరింత తెలుసుకోవడానికి EEA నివాసితుల విభాగాన్ని చూడండి.

    మీ సమాచారానికి సంబంధించి మీకు ఉన్న ఎంపికలు

    మీ సమాచారానికి సంబంధించి మీకు సరళమైన మరియు అర్థవంతమైన ఎంపికలను అందించడమే మా లక్ష్యం. మీకు Pinterest ఖాతా ఉన్నట్లయితే, ఈ నియంత్రణలలో చాలావరకు నేరుగా Pinterest లేదా మీ సెట్టింగ్‌లలో నిర్మించబడతాయి. ఉదాహరణకు, మీరు వీటిని చేయవచ్చు:

  • ఎప్పుడైనా మీ ప్రొఫైల్‌లో సమాచారాన్ని సవరించండి, మీ ప్రొఫైల్ శోధన ఇంజిన్‌లకు అందుబాటులో ఉండాలో లేదో నిర్ణయించండి లేదా ఇతరులు మీ ఇమెయిల్ చిరునామాను ఉపయోగించి మీ Pinterest ఖాతాను కనుగొనవచ్చో లేదో ఎంచుకోండి.
  • ఇతర సేవల (Facebook, Google లేదా Twitter వంటివి) నుండి మీ Pinterest ఖాతాను లింక్ చేయవచ్చు లేదా అన్‌లింక్ చేయవచ్చు. కొన్ని సేవలకు (Facebook వంటివి), మీ Pinterest కార్యాచరణను ఆ సేవకు ప్రచురించాలా వద్దా అనేది కూడా మీరు నిర్ణయించుకోవచ్చు.
  • రహస్య బోర్డు సెట్టింగ్‌లను సవరించండి. మీకు మరియు బోర్డులోని ఇతర సహకారులకు రహస్య బోర్డులు కనిపిస్తాయి, అలాగే ఏ సహకారి అయినా బోర్డును వేరే ఎవరికైనా అందుబాటులో ఉంచేలా ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, మరొక సహకారి వేరే ఒకరిని బోర్డుకి ఆహ్వానించవచ్చు, వారు Pinterestను చూడటానికి ఉపయోగించే యాప్‌కు బోర్డును అందుబాటులో ఉంచవచ్చు లేదంటే బోర్డు నుండి ఒక చిత్రాన్ని తీసుకొని, వారి స్నేహితులకు ఇమెయిల్ చేయవచ్చు.
  • ఇతర ప్లాట్‌ఫారమ్‌లు, సైట్‌లు లేదా యాప్‌లలో మీకు పంపిణీ చేయబడిన Pinterest ప్రకటనలు మీ ఖాతా కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించి అనుకూలీకరించబడ్డాయో లేదో ఎంచుకోండి. మీ సెట్టింగులను సందర్శించడం ద్వారా మరియు మీ “వ్యక్తిగతీకరణ” ప్రాధాన్యతలను నవీకరించడం ద్వారా మీరు దీన్ని నియంత్రించవచ్చు.
  • ప్రకటనల పనితీరు నివేదన కోసం Pinterestలో మీ కార్యాచరణకు సంబంధించిన సమాచారాన్ని Pinterest భాగస్వామ్యం చేయాలో లేదో ఎంచుకోండి. మీరు మీ సెట్టింగ్‌లకు వెళ్లి, మీ “డేటా వ్యక్తిగతీకరణ” ప్రాధాన్యతలను అప్‌డేట్ చేయడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు.
  • మీ ఖాతాను ఎప్పుడైనా మూసివేయండి. మీరు మీ ఖాతాను మూసివేసినప్పుడు, మేము దాన్ని నిష్క్రియం చేస్తాము, Pinterest నుండి మీ పిన్‌లు మరియు బోర్డులను తీసివేస్తాము మరియు మీ ఖాతా డేటాను తొలగిస్తాము. డేటాను భద్రపరచమని మమ్మల్ని కోరుతూ చట్ట పరిరక్షణ సంస్థ నుండి అభ్యర్థనను అందుకోవడం వంటి చట్టపరమైన కారణాల వలన మేము మీ డేటాను ఉంచుకోవచ్చని దయచేసి గుర్తుంచుకోండి. అలాగే మేము పరిమిత సమయ వ్యవధి వరకు లేదా చట్టప్రకారం అవసరమైన పరిధి మేరకు మా బ్యాకప్ సిస్టమ్‌లలో నిర్దిష్ట సమాచారాన్ని కలిగి ఉండవచ్చు.
  • అలాగే మీరు Pinterestను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే పరికరం లేదా సాఫ్ట్‌వేర్ ద్వారా మీకు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు:

  • మీరు ఉపయోగించే బ్రౌజర్‌తో కుక్కీలు లేదా ఇతర రకాల స్థానిక డేటా నిల్వను మీరు నియంత్రించవచ్చు.
  • మీ ఖచ్చితమైన స్థానం, ఫోటోలు, పరిచయాలు మరియు ఇతర డేటా మాతో భాగస్వామ్యం చేయబడే విధానాన్ని, అలాగే భాగస్వామ్యం చేయబడాలా లేదా అంశాన్ని మీ మొబైల్ పరికరం ద్వారా మీరు ఎంచుకోవచ్చు.
  • ఈ ఎంపికల గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి మీ పరికరం లేదా సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ అందించిన సమాచారాన్ని చూడండి.

     

    మేము సమాచారాన్ని ఎలా మరియు ఎప్పుడు భాగస్వామ్యం చేస్తాము

    మీరు సృష్టించిన పబ్లిక్ బోర్డులు మరియు పిన్‌లు, అలాగే మీరు మాకు అందించే ప్రొఫైల్ సమాచారాన్ని ఎవరైనా చూడవచ్చు. మేము ఈ పబ్లిక్ సమాచారాన్ని APIలు (సాధారణంగా సమాచారాన్ని త్వరగా పంచుకునే సాంకేతిక మార్గం) అని పిలువబడే వాటి ద్వారా కూడా అందుబాటులో ఉంచుతాము. ఉదాహరణకు, ఒక భాగస్వామి Pinterest APIని ఉపయోగించడం ద్వారా వారి అత్యంత ప్రాచుర్యం పొందిన పిన్‌లు ఏమిటో లేదా Pinterestలో వారి పిన్‌లు ఎలా భాగస్వామ్యం చేయబడుతున్నాయో అధ్యయనం చేయవచ్చు. మేము మీ సమాచారాన్ని వీటితో కూడా భాగస్వామ్యం చేస్తాము:

  • ఇతర సేవలు, మీ నిర్దేశం మేరకు, Pinterestకి సైన్ అప్ చేసుకునే లేదా లాగిన్ చేసే సౌలభ్యాన్ని మీకు అందించడం కోసం చేస్తాము లేదా మీరు Facebook లేదా Google వంటి ఆ సేవలకు మీ Pinterest ఖాతాను లింక్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు లేదా మీరు వారికి Pinterestలో మీ కంటెంట్‌ను ప్రచురించినప్పుడు. ఉదాహరణకు, మీరు Facebook లేదా Twitterకు మీ పిన్‌లను ప్రచురించాలని ఎంచుకుంటే, ఆ కంటెంట్‌కు సంబంధించిన సమాచారం Facebook లేదా Twitterతో భాగస్వామ్యం చేయబడుతుంది.
  • Pinterest కాకుండా Facebook ప్రకటనలు, Google మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్, Microsoft వ్యాపార ప్రకటనలు, LinkedIn వ్యాపార ప్రకటనలు, ది ట్రేడ్ డెస్క్ మరియు ఇతరుల వంటి సైట్‌లు మరియు యాప్‌లలో సమయానుగుణంగా మీకు Pinterestను మార్కెట్ చేయడానికి మేము ఉపయోగించే సేవలు. మీరు మీ సెట్టింగ్‌లలో ఇటువంటి వ్యాపార ప్రకటన సేవలతో భాగస్వామ్యం చేయడాన్ని నిలిపివేయవచ్చు.
  • వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లలో ప్రకటనలు లేదా కంటెంట్ పంపిణీ మరియు పనితీరును ఆడిట్ చేయడానికి లేదా మెరుగుపరచడానికి మేము లేదా వారు ఉపయోగించే ఆన్‌లైన్ ప్రకటనదారులు మరియు మూడవ పక్షం కంపెనీలు (ఉదాహరణకు, Google Analytics ద్వారా). Pinterestలో మీకు చూపబడిన పిన్‌​లు లేదా ప్రకటనలను భాగస్వామ్యం చేయడం మరియు ఆ పిన్​‌​లు లేదా ప్రకటనలను వినియోగించారా లేదా లేదంటే ఎలా వినియోగించారు లేదా Pinterestలో మీ కార్యాచరణ గురించి ఇతర సమాచారాన్ని భాగస్వామ్యం చేయడం ఇందులో ఉంటుంది. మేము ఆన్‌లైన్ ప్రకటనదారులతో సమాచారాన్ని ఎలా భాగస్వామ్యం చేస్తామనే దాని గురించి మరింత తెలుసుకోండి. ప్రకటన పనితీరును విశ్లేషించే మూడవ పక్షం కంపెనీల గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి మా సహాయ కేంద్రాన్ని సందర్శించండి.
  • మా సూచనల ఆధారంగా మరియు ఈ గోప్యతా విధానంలో వివరించిన ప్రయోజనాల కోసం మా తరఫున సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి మేము నియమించుకునే మూడవ పక్షం కంపెనీలు, సేవా ప్రదాతలు లేదా వ్యక్తులు. ఉదాహరణకు, స్పామ్‌ను మెరుగ్గా గుర్తించడంలో మాకు సహాయపడటానికి మేము భద్రతా సలహాదారులతో డేటాను భాగస్వామ్యం చేస్తాము. మేము పొందిన కొంత సమాచారం మా తరఫున మూడవ పక్షం ప్రదాతలు సేకరించి ఉండవచ్చు.
  • చట్ట పరిరక్షణ ఏజెన్సీలు లేదా ప్రభుత్వ ఏజెన్సీలు. ప్రజలు, ఎవరైనా వ్యక్తి లేదా Pinterest యొక్క భద్రత, హక్కులు లేదా ఆస్తిని రక్షించడానికి; లేదంటే మోసం, భద్రత లేదా సాంకేతిక సమస్యలను గుర్తించడానికి, నిరోధించడానికి లేదా పరిష్కరించడానికి చట్టం, నిబంధన లేదా చట్టపరమైన అభ్యర్థనకు లోబడి ఉండటానికి వెల్లడించడం సహేతుకంగా అవసరమని మేము విశ్వసిస్తే మాత్రమే సమాచారాన్ని అందిస్తాము.
  • పూర్తిగా మా యాజమాన్యంలోని ఉపసంస్థలు మరియు అనుబంధ సంస్థలు. మేము విలీనం, సముపార్జన, దివాలా, రద్దు, పునర్వ్యవస్థీకరణ లేదా ఇలాంటి లావాదేవీలు లేదంటే ఈ విధానంలో వివరించిన సమాచారాన్ని బదిలీ చేసేటటువంటి చర్యలో పాల్గొనాల్సి ఉన్నట్లయితే, ఆ ప్రక్రియలో పాలుపంచుకునే పక్షంతో (ఉదాహరణకు , సంభావ్య కొనుగోలుదారు) మీ సమాచారాన్ని భాగస్వామ్యం చేస్తాము.
  • మేము మీ సమాచారాన్ని ఎంతకాలం ఉంచుకుంటాము

    మీకు Pinterestను అందించడానికి మరియు ఈ విధానంలో వివరించిన ప్రయోజనాలను నెరవేర్చడానికి మాకు అవసరమైనంత కాలం మాత్రమే మేము మీ సమాచారాన్ని ఉంచుకుంటాము. మీ సమాచారాన్ని ఉపయోగించాల్సిన మరియు మా చట్టపరమైన లేదా నియంత్రణాపూర్వకమైన బాధ్యతలకు లోబడి ఉండేందుకు దాన్ని కలిగి ఉండాల్సిన అవసరం మాకు లేనప్పుడు, మేము దాన్ని మా సిస్టమ్‌ల నుండి తీసివేస్తాము లేదా మేము మిమ్మల్ని గుర్తించలేని విధంగా అందులో వ్యక్తిగత వివరాలు లేకుండా చేస్తాము.

    పిల్లల సమాచారంపై మా విధానం

    13 ఏళ్లలోపు పిల్లలు Pinterest ఉపయోగించడానికి అనుమతించబడరు. మీరు EEAలో ఉంటున్నట్లయితే, మీరు మీ దేశంలోని చట్టాల ప్రకారం డేటా ప్రాసెసింగ్‌కు సమ్మతి అందించగల వయస్సు దాటినవారైతే మాత్రమే Pinterestను ఉపయోగించవచ్చు.

    మీ ఎంపికలు

    మీ గురించి మేము కలిగి ఉన్న సమాచారానికి సంబంధించి మీకు ఎంపికలు ఉన్నాయి. ఈ ఎంపికలను వినియోగించుకోవడానికి, దయచేసి మీ ఖాతా సెట్టింగ్‌లను సందర్శించండి, ఆపై మీకు ఇంకా సహాయం అవసరమైతే, మా సహాయ కేంద్రాన్ని సందర్శించండి.

  • మేము మీ గురించి సేకరించే మరియు కలిగి ఉండే సమాచారానికి యాక్సెస్‌ను అభ్యర్థించండి. మా సహాయ కేంద్రం ద్వారా మీరు అభ్యర్థించిన తర్వాత నుండి 30 రోజులలోపు మేము సాధారణంగా దీన్ని మీతో భాగస్వామ్యం చేస్తాము.
  • మీ సమాచారాన్ని సరిదిద్దండి లేదా తొలగించండి. మీరు మీ ప్రొఫైల్‌లో మీ సమాచారాన్ని అప్‌డేట్ చేయవచ్చు లేదా మీ ఖాతాను మూసివేయడం ద్వారా మీ డేటాను తొలగించవచ్చు.
  • లక్ష్యం చేయబడిన అడ్వర్టయిజింగ్‌ను నిలిపివేయండి. ఈ విధానంలో వివరించబడిన కొన్ని కార్యాచరణలు అనేవి కొన్ని చట్టాల కింద "లక్ష్యం చేయబడిన అడ్వర్టయిజింగ్‌"గా పరిగణించబడవచ్చు. మీ గోప్యత మరియు డేటా సెట్టింగ్‌లలోని సూచనలను అనుసరించడం ద్వారా Pinterestలో మరియు వెలుపల మీకు ప్రకటనలను చూపడానికి మేము సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము మరియు వెల్లడిస్తామనే అంశాలను మీరు నియంత్రించవచ్చు. అలాగే మేము iOSలో ప్రకటన ట్రాకింగ్‌ను పరిమితం చేయడం, Android పరికరాలలో ప్రకటనల వ్యక్తిగతీకరణ, అలాగే బ్రౌజర్‌లలో ట్రాక్ చేయవద్దు వంటి సెట్టింగ్‌లకు మద్దతు ఇస్తాము. ట్రాక్ చేయవద్దు ఎంపిక వలన మా సేకరణ మరియు Pinterest వెలుపల సేకరించిన డేటా వినియోగం ఎలా ప్రభావితం అవుతాయనే దాని గురించి మరింత తెలుసుకోండి..
  • మీ సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి మాకు అభ్యంతరం. మీకు మార్కెటింగ్ ఇమెయిల్‌లు లేదా పుష్ నోటిఫికేషన్‌లను పంపడానికి మేము మీ సమాచారాన్ని ఉపయోగించినప్పుడు సహా మీ సమాచారాన్ని ఉపయోగించడం ఆపివేయమని మీరు మమ్మల్ని అడగవచ్చు. మా నుండి మార్కెటింగ్ సందేశాలను స్వీకరించడాన్ని మీరు నిలిపివేసినప్పటికీ, మీ పిన్‌లలో ఒకదానిపై ఎవరైనా వ్యాఖ్యానించినప్పుడు వంటి సందర్భాలలో మీ ఖాతాకు సంబంధించిన అప్‌డేట్‌లను మేము మీకు పంపవచ్చు.
  • మీరు మాకు అందించిన సమాచారాన్ని మరొక సంస్థకు పంపండి, ఇక్కడ మేము మీ సమ్మతితో లేదా మీతో కుదుర్చుకున్న ఒప్పందం నిర్వహణ కోసం ఈ సమాచారాన్ని కలిగి ఉంటాము మరియు ఇలా చేయడం మాకు సాంకేతికపరంగా సాధ్యమవుతుంది.
  • మేము సేకరించే సమాచారం మరియు దాన్ని ఎలా మరియు ఎందుకు ఉపయోగిస్తాము మరియు భాగస్వామ్యం చేస్తామనే అంశాల గురించి మరిన్ని వివరాలను అభ్యర్థించండి.
  • మీ వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన మీ ఎంపికలను వినియోగించుకోవాలని మీరు ఎంచుకుంటే, మేము మీపై వివక్ష చూపము. మేము మీ అభ్యర్థనను తిరస్కరిస్తే, మమ్మల్ని సంప్రదించడం ద్వారా మా నిర్ణయంపై అప్పీల్ చేసే హక్కు మీకు ఉండవచ్చు. మీ ఎంపికలు మరియు నిర్దిష్ట ఎంపికలను వినియోగించడం వల్ల కలిగే పరిణామాల గురించి మీకు స్పష్టంగా తెలియజేయడానికి మేము కృషి చేస్తాము. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

     

    EEA నివాసితులు

    మా డేటా ప్రాసెసింగ్ కార్యకలాపాల గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మీరు Pinterest యూరప్ లిమి. అనే డేటా కంట్రోలర్‌ను సంప్రదించాలి, ఈ ఐరిష్ కంపెనీ నమోదిత కార్యాలయ చిరునామా పామర్‌స్టన్ హౌస్, 2వ అంతస్తు, ఫెనియన్ స్ట్రీట్, డబ్లిన్ 2, ఐర్లాండ్. అలాగే మీరు మా డేటా రక్షణ అధికారిని కూడా సంప్రదించవచ్చు.



    మేము డేటా రక్షణ చట్టాలకు లోబడి లేమని మీరు భావిస్తే, ఐర్లాండ్‌లోని డేటా రక్షణ కమీషన్‌కు లేదా మీ స్థానిక పర్యవేక్షక అధికార సంస్థకు ఫిర్యాదు చేయగల హక్కు మీకు ఉంది.

    Pinterest అనేది ప్రపంచవ్యాప్త సేవ కాబట్టి, మేము EEA నివాసితుల వ్యక్తిగత డేటాను EEA వెలుపల ఉన్న దేశానికి బదిలీ చేయవచ్చు. మేము EEA నుండి సమాచారాన్ని తగిన స్థాయిలో రక్షణను అందించని దేశానికి బదిలీ చేసే సందర్భంలో, మీ సమాచారాన్ని రక్షించడానికి ప్రామాణిక ఒప్పందపూర్వక నిబంధనల వంటి తగిన భద్రతా ప్రమాణాల ప్రకారం మాత్రమే బదిలీ చేస్తాము.

    మేము ఈ విధానంలో ఎలా మార్పులు చేస్తాము

    మేము ఎప్పటికప్పుడు ఈ విధానాన్ని మార్చవచ్చు మరియు మేము మార్చినట్లయితే, ఈ పేజీలో ఏవైనా మార్పులను పోస్ట్ చేస్తాము. ఆ మార్పులు అమలులోకి వచ్చిన తర్వాత మీరు Pinterestను ఉపయోగించడం కొనసాగిస్తే, మీరు కొత్త విధానానికి అంగీకరిస్తున్నట్లు పరిగణించబడుతుంది. మార్పులు ముఖ్యమైనవి అయితే, మేము చట్ట ప్రకారం అవసరమైన పరిధి మేరకు మరింత ప్రముఖంగా నోటీసు ఇవ్వవచ్చు లేదా మీ సమ్మతిని పొందవచ్చు.

    మమ్మల్ని సంప్రదించండి

    సహాయ కేంద్రం అనేది మాతో సన్నిహితంగా ఉండటానికి లేదా ఎగువ వివరించినటువంటి మీ ఎంపికలను వినియోగించుకోవడానికి ఉత్తమ మార్గం. మీరు యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నట్లయితే, మీ సమాచారానికి Pinterest, Inc. బాధ్యత వహిస్తుంది. మీరు Pinterest Inc.ను 651 బ్రాన్నన్ స్ట్రీట్, శాన్ ఫ్రాన్సిస్కో, సిఎ 94107, యుఎస్ఎ.

    అమలులోకి వచ్చే తేదీ 16 డిసెంబర్, 2022