కంటెంట్‌ని క్లెయిమ్ చేసే పోర్టల్‌ని ఉపయోగించడం

ఈ కంటెంట్​zwnj​ని క్లెయిమ్ చేసే పోర్టల్​zwnj​కి సంబంధించిన సేవా నిబంధనలు ("ఒప్పందం") దిగువ పేర్కొన్న వారి మధ్య, వారి ద్వారా కుదిరింది: (1) మీరు (“హక్కుల యజమాని”, “మీరు” లేదా “మీ యొక్క”) మరియు (2) (x) మీరు యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నట్లయితే, 651 బ్రన్నన్ స్ట్రీట్, శాన్ ఫ్రాన్సిస్కో, CA 94107, USAలో ప్రధాన వ్యాపార ప్రదేశాన్ని కలిగి ఉన్న Pinterest, Inc. మరియు (y) మీరు యునైటెడ్ స్టేట్స్‌కి వెలుపల నివసిస్తున్నట్లయితే, పామర్స్‌టన్ హౌస్, 2వ అంతస్తు, ఫెనియాన్ స్ట్రీట్, డబ్లిన్ 2, ఐర్లాండ్‌లో నమోదిత కార్యాలయాన్ని కలిగి ఉండే (వర్తించే పక్షంలో, “Pinterest”) Pinterest యూరప్ లిమి., అలాగే మీరు ఈ ఒప్పందాన్ని అంగీకరించిన తేదీ (“ప్రభావిత తేదీ”) నుండి అమలులోకి వస్తుంది.  “అంగీకరించు” బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా, మీరు (i) ఈ ఒప్పందానికి మీ అంతట మీరుగా కట్టుబడి ఉంటానని అంగీకరిస్తూ, ఆమోదిస్తున్నారు; మరియు/లేదా (ii) మీరు మరొక పక్షానికి చెందిన వారి (ఉదా.  మీ యజమాని లేదా ప్రిన్సిపాల్) తరఫున పని చేయడానికి లేదా వారికి ప్రాతినిధ్యం వహించడానికి అధికారం కలిగి ఉన్నారనీ, వారి తరఫున ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని అంగీకరిస్తూ, ఆమోదిస్తున్నారు.

1. నిర్వచనాలు

“చర్య” అంటే Pinterest ప్లాట్‌ఫారమ్‌లో కంటెంట్ సరిపోలిక గుర్తించబడినప్పుడు మీరు సిస్టమ్‌లో పేర్కొనే చర్య.  సిస్టమ్‌లో అందించబడే చర్యలు కాలక్రమేణా మారవచ్చు, కానీ తొలగింపు, పరిమితం చేయబడడం లేదా ఏవైనా ఇతర చర్యలను కలిగి ఉండవచ్చు.

“ID ఫైల్” అంటే ఒక పనిని వివరించే మరియు ఆ పని యొక్క స్వయంచాలక సరిపోలిక కోసం ఉపయోగించబడే రెఫరెన్స్ ఫైల్ నుండి సృష్టించబడిన ప్రత్యేకమైన బైనరీ డేటా.

“కంటెంట్ సరిపోలిక” అంటే ఐడి ఫైల్‌కు సరిపోలుతున్నట్లు సిస్టమ్ గుర్తించిన పిన్.

“పరిమితి” అనేది నిర్దిష్ట ప్రమాణాలు పాటించిన పక్షంలో మినహా Pinterest ప్లాట్‌ఫారమ్‌లో నుండి కంటెంట్ సరిపోలిక తీసివేయడం వంటి మీరు సిస్టమ్‌లో పేర్కొనే నిర్దిష్ట చర్యను సూచిస్తుంది, నిర్దిష్ట డొమైన్‌కి లింక్ చేసే కంటెంట్ సరిపోలిక లేదా Pinterest ప్లాట్‌ఫారమ్‌లో వాస్తవంగా మీరు చేయడం వంటివి.

“Pinterest ప్లాట్‌ఫారమ్” అంటే Pinterest వెబ్‌సైట్, యాప్‌లు, API లు మరియు విడ్జెట్‌లు.

“రెఫరెన్స్ ఫైల్” అంటే పనికి సంబంధించిన డిజిటల్ ఫైల్.

“తీసివేయడం” అనేది మీరు సిస్టమ్‌లో పేర్కొనే చర్యను సూచిస్తుంది, ఇందులో కంటెంట్ సరిపోలిక గుర్తించబడినప్పుడు Pinterest ప్లాట్‌ఫారమ్‌లో అది చూపబడకుండా తీసివేయబడుతుంది.

“సిస్టమ్” అంటే కంటెంట్‌ని క్లెయిమ్ చేసే పోర్టల్‌గా పిలువబడే Pinterest యొక్క కంటెంట్ క్లెయిమింగ్ మరియు మేనేజ్‌మెంట్ సిస్టమ్. 

“సిస్టమ్ మార్గదర్శకాలు” అంటే సమగ్రంగా, మీ సిస్టమ్ వినియోగాన్ని నియంత్రించే విధానాలు, మార్గదర్శకాలు మరియు నిర్దేశకాలు, వీటిని Pinterest ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది, అలాగే రెఫరెన్స్ కోసం వాటిని ఇక్కడ పొందుపరచడం జరిగింది.

“పిన్” అంటే మూడవ పక్షం వినియోగదారు Pinterest ప్లాట్‌ఫారమ్‌కు సేవ్ చేసిన కంటెంట్ యొక్క ఉదాహరణ.

“పని” అంటే హక్కుల యజమాని స్వంతంగా కలిగి ఉండే లేదా నియంత్రించే కాపీరైట్ చేసిన పని.

 

2. లైసెన్స్‌లు మరియు యాజమాన్యం

ఈ ఒప్పందం యొక్క షరతులు మరియు నిబంధనలకు లోబడి, మీరు Pinterest ప్లాట్‌ఫారమ్‌లో మీ పనులను గుర్తించడం మరియు నిర్వహించడం కోసం సిస్టమ్‌ని పూర్తిగా వినియోగించుకునేందుకు Pinterest మీకు ప్రపంచవ్యాప్తమైన, ఎలాంటి మినహాయింపులు లేని, బదిలీ చేయలేని, రాయల్టీ రహిత లైసెన్స్‌ని మంజూరు చేస్తుంది, ఇది మీరు సిస్టమ్ మార్గదర్శకాలకు లోబడి ఉండటానికి అనుగుణంగా ఉంటుంది. రెఫరన్స్ ఫైల్‌లను అందజేయడం ద్వారా, మీరు (ఎ) (తాత్కాలిక క్యాష్ మరియు స్టోరేజీ కాపీలు చేసే హక్కుతో సహా) నిల్వ చేయడం, కాపీ చేయడం, ప్రదర్శించడం, ఉత్పన్న రచనలను సృష్టించడం లేదా సవరించడం లేదా ఆకృతి మార్చడం, సారాంశం రాబట్టడం, విశ్లేషించడం, అల్గారిథమ్‌లు మరియు బైనరీ సూచలను సృష్టించేందుకు వినియోగించడం, ఐడి ఫైల్‌లను సృష్టించడం మరియు ఇతరత్రా రెఫరెన్స్ ఫైల్‌లు, ఐడి ఫైల్‌లు మరియు సిస్టమ్‌ను ఆపరేట్ చేయడం, పరీక్షించడం మరియు మెరుగుపరచడానికి సంబంధించిన ఏదైనా అనుబంధిత మెటాడేటా ఉపయోగించడం మరియు Pinterest ప్లాట్‌ఫారమ్‌లో చర్యలను అమలు చేయడం లేదా దాన్ని నిర్వహించడం కోసం, మీరు Pinterestకి ఎలాంటి మినహాయింపులు లేని, రాయల్టీ రహిత, పరిమితం చేయబడిన లైసెన్స్‌ని మంజూరు చేస్తున్నారు. సిస్టమ్ యొక్క ఏదైనా ఉద్దేశ్యపూర్వక దుర్వినియోగంతో సహా, ఏ కారణం చేతనైనా సిస్టమ్‌ను యాక్సెస్ చేయగలిగే లేదా ఉపయోగించుకోగలిగే మీ హక్కును Pinterest రద్దు చేయవచ్చు లేదా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.

3. రెఫరెన్స్ ఫైల్‌లు

Pinterest పేర్కొన్న డెలివరీ పద్ధతి ద్వారా మీరు సిస్టమ్ ద్వారా సరిపోల్చాలనుకునే ప్రతి పనికి మీరు రెఫరెన్స్ ఫైల్‌ను అందిస్తారు. అటువంటి పనుల కోసం ఆన్‌లైన్ పంపిణీ హక్కుల యొక్క ప్రత్యేక లైసెన్స్‌దారు అయితే తప్ప మీరు మూడవ పక్షాలకు స్వంతమైనటువంటి పనులకు రెఫరెన్స్ ఫైల్‌లను అందించరు. సిస్టమ్ సరిగ్గా పనిచేయడానికి పూర్తి, ఖచ్చితమైన, లోపం లేని మరియు సరిగ్గా ఆకృతీకరించబడిన రెఫరెన్స్ ఫైల్‌లు అవసరమని మీరు గుర్తించారు, అలాగే ఆ సమాచారాన్ని అందించడంలో విఫలమైనట్లయితే, సిస్టమ్ పని చేయకపోవటానికి కారణం కావచ్చు మరియు కంటెంట్ సరిపోలికలు తప్పు కావడం మరియు సరికాని చర్య అమలు కావడం వంటి వాటికి దారితీయవచ్చు. రెఫరెన్స్ ఫైల్ అనేది సిస్టమ్ వినియోగ మార్గదర్శకాలకు లోబడి ఉండటంలో విఫలమైందని లేదంటే సిస్టమ్ లేదా Pinterest ప్లాట్‌ఫారమ్ యొక్క సమర్థత లేదా ఖచ్చితత్వానికి హాని కలిగించే అవకాశం ఉందని Pinterest, దాని స్వంత అభీష్టానుసారం నిర్ధారించినట్లయితే, Pinterest రెఫరెన్స్ ఫైల్‌ను ఉపయోగించడానికి నిరాకరించవచ్చు.

మీరు మీ రెఫరెన్స్ ఫైల్‌లలో దేనినైనా ఎప్పుడైనా తీసివేయవచ్చు, ఆపై Pinterest సంబంధిత ఐడి ఫైల్‌లను సిస్టమ్ నుండి తీసివేస్తుంది, ఆ విధంగా, సిస్టమ్ ఆ ఐడి ఫైల్‌లు మరియు రెఫరెన్స్ ఫైల్‌ల కోసం కంటెంట్ సరిపోలికలను గుర్తించడం మరియు వాటికి చర్యలను వర్తింపజేయడం ఆపివేస్తుంది. 

మీరు అందించే రెఫరెన్స్ ఫైల్‌లకు అనధికార యాక్సెస్‌ని నిరోధించడానికి రూపొందించిన సహేతుకమైన ప్రమాణాలను Pinterest ఉపయోగిస్తుంది. 

4. ప్రాతినిధ్యాలు మరియు వారెంటీలు

ఈ ఒప్పందంలో ప్రవేశించడానికి తమకు పూర్తి శక్తి మరియు అధికారం ఉందని ఇరుపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తూ, హామీ ఇస్తారు. మీరు ఈ క్రింది వాటికి ప్రాతినిధ్యం వహిస్తూ, హామీ ఇస్తున్నారు: (i) మీరు ఇక్కడ పేర్కొన్న మీ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించటానికి, (ii) ఇక్కడ పేర్కొన్న హక్కులు మరియు లైసెన్స్​లను మంజూరు చేయడానికి మరియు పనులకు అనుబంధంగా సిస్టమ్​ను ఉపయోగించడానికి; (iii) రెఫరెన్స్ ఫైల్‌లు, ఐడి ఫైల్‌లు మరియు ఏదైైనా అనుబంధిత మెటాడేటాను Pinterest ఉపయోగించడానికి, మరియు (iv) పిన్‌లకు నిర్దిష్ట చర్యలను వర్తింపజేేయడానికి; (ఎ) అవసరమైన అన్ని హక్కులు, అధికారాలు మరియు లైసెన్స్​లను మీరు కలిగి ఉండడంతో పాటు వాటిని నిర్వహిస్తారు (బి) రెఫరెన్స్ ఫైల్‌లు, ఫలితంగా ఐడి ఫైల్‌లు మరియు ఏదైనా అనుబంధిత మెటాడేటా మరియు Pinterest వాటిని ఉపయోగించడం ద్వారా మీకు మరియు మూడవ పక్షం వారికి మధ్య ఒప్పందాల నుండి ఉత్పన్నమయ్యే హక్కులు, కాపీరైట్, ట్రేడ్‌మార్క్, వాణిజ్య రహస్యం, నైతిక హక్కులు, గోప్యతా హక్కులు, ప్రచార హక్కులు లేదా ఏదైనా ఇతర మేధో సంపత్తి లేదా యాజమాన్య హక్కులతో సహా మూడవ పక్షం హక్కు దేన్నీ ఉల్లంఘించడం లేదు; (సి) రెఫరెన్స్ ఫైల్‌లు ఏ విధమైన పాడైపోయిన ఫైల్, వైరస్‌లు, వార్మ్‌లు, ట్రోజన్ హార్స్‌లు లేదా ఇతర సారూప్య హానికరమైన భాగాలను కలిగి ఉండకపోవడంతో పాటు అవి ఏర్పడే అవకాశాన్ని కూడా అందజేయవు; (డి) పిన్‌లకు సంబంధించి మీరు తప్పుడు క్లెయిమ్‌లు చేయకపోవడంతో పాటు పనిలోని మీ హక్కుల ఆధారంగా పిన్​లకు చర్యలను చట్టబద్ధంగా వర్తింపజేయడం తప్ప మరే ఏ ఇతర ఉద్దేశానికైనా సిస్టమ్​ను ఉపయోగించరు; (ఇ) మీరు సిస్టమ్​ను యాక్సెస్ చేయడానికి లేదా ఉపయోగించడానికి మూడవ పక్షం వారిని అనుమతించరు; మరియు (ఎఫ్) మీరు సిస్టమ్ నుండి సోర్స్ కోడ్​ను (i) మీ అంతట మీరుగా విడదీయడం, డీకంపైల్ చేయడం, రివర్స్ ఇంజినీర్ చేయడం, విడదీయడం లేదా ప్రయత్నించడం లేదా (ii) ఉత్పన్న రచనలు చేసేందుకు, డీకంపైల్ చేసేందుకు, రివర్స్ ఇంజినీర్ చేసేందుకు, సిస్టమ్ నుండి సోర్స్ కోడ్​ను విడదీసేందుకు లేదా ప్రయత్నించేందుకు పక్షాలు కాని వారిని మరెవరినైనా అనుమతించడం వంటివి చేయరు.

5. వినియోగదారులు మరియు హక్కుల యజమానులతో వివాదాలు

ఎప్పటికప్పుడు, Pinterest (1) ఒక పిన్ మీ చర్యకు తప్పుగా గురి చేయబడిందని లేదా (2) మరొక హక్కుదారు మీ రెఫరెన్స్ ఫైల్‌లతో విభేదించే రెఫరెన్స్ ఫైల్‌లను అప్‌లోడ్ చేసారని క్లెయిమ్‌లను స్వీకరించవచ్చు లేదా తెలుసుకోవచ్చు. ఇటువంటి సందర్భాలలో, మీకు మరియు ఇతర హక్కుదారు(లు) లేదా వినియోగదారుల (లేదా ఇతర హక్కుదారులు లేదా వినియోగదారుల మధ్య) మధ్య తలెత్తిన ఏదైనా వివాదం పరిష్కారానికి లోబడి, Pinterest దాని స్వంత అభీష్టానుసారం పిన్‌ను నిర్వహించడం లేదా Pinterest ప్లాట్‌ఫారమ్‌కు పునరుద్ధరించడం, చర్యను వర్తింపజేయడాన్ని ఆపివేయడం లేదంటే వైరుధ్యం లేదా వివాదాన్ని పరిష్కరించడానికి తగిన ఇతర చర్యలు తీసుకోవడం వంటివి ఎంచుకోవచ్చు, కానీ ఇవి తప్పనిసరిగా చేయాల్సిన అవసరం లేదు.  మూడవ పక్షం నుండి పిన్‌కు సంబంధించి Pinterest క్లెయిమ్‌ను స్వీకరించిన సందర్భంలో, Pinterest మూడవ పక్షం వారితో లేదా (ఎ) మీ గుర్తింపుతో సహా ఇతర ప్రభావిత వినియోగదారులతో సమాచారాన్ని పంచుకోవచ్చు; (బి) సంబంధిత రెఫరెన్స్ ఫైల్‌కు సంబంధించి మీరు మాకు అందించినవి; మరియు (సి) మీతో ఉన్న వివాదం ద్వారా మూడవ పక్షానికి సహాయపడే ఇతర సమాచారం.

6. నష్టపరిహారం

ఏదైనా పక్షానికి చెందిన వారు ఈ ఒప్పందంలో పేర్కొన్న ప్రాతినిధ్యాలు మరియు వారెంటీలను ఉల్లంఘించిన కారణంగా ఏర్పడే ఏవైనా మరియు మూడవ పక్షానికి చెందిన అన్ని క్లెయిమ్‌ల నుండి మరియు వాటి ద్వారా ఏర్పడే అన్ని సమస్యల నుండి ఇతర పక్షాల వారిని మరియు వారి మరియు దాని డైరెక్టర్‌లు, అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్‌లు, కాంట్రాక్టర్‌లు మరియు లైసెన్స్‌దారులకు ప్రతి పక్షం వారు నష్టపరిహారం అందిస్తారు, రక్షిస్తారు మరియు హాని కలగకుండా చూస్తారు. అంతే కాకుండా, రెఫరెన్స్ ఫైల్‌లు, ఐడి ఫైల్‌లు, ఏవైనా ఇతర అనుబంధిత మెటాడేటాతో పాటు మీరు అందజేసే మరేదైనా ఇతర కంటెంట్‌ను Pinterest అధికారికంగా ఉపయోగించడానికి సంబంధించి ఏర్పడే ఏవైనా మరియు మూడవ పక్షానికి చెందిన అన్ని క్లెయిమ్‌ల నుండి మరియు వాటి ద్వారా ఏర్పడే అన్ని సమస్యల నుండి Pinterestను మరియు దాని డైరెక్టర్‌లు, అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్‌లు, కాంట్రాక్టర్‌లు మరియు లైసెన్స్‌దారులకు మీరు నష్టపరిహారం అందించాలి, రక్షించాలి మరియు హాని కలగకుండా చూడాలి.

7. వారెంటీ నిరాకరణ

ఈ ఒప్పందంలో పేర్కొన్న స్పష్టమైన వారెంటీలు మినహా, వర్తక యోగ్యత, నిర్దిష్ట ప్రయోజనానికి యోగ్యత, ఉల్లంఘనరహితం వంటి సూచిత వారెంటీలు మరియు సిస్టమ్ నాణ్యత లేదా పనితీరుకు సంబంధించిన వారెంటీలతో సహా స్పష్టమైన లేదా సూచితమైన అన్ని ఇతర వారెంటీలను పక్షాలు నిరాకరిస్తాయి.

8. బాధ్యత యొక్క పరిమితులు

సెక్షన్ 6లోని నష్టపరిహారాల కోసం లేదా సెక్షన్ 11లోని గోప్యతా నిబంధలను ఉల్లంఘించిన కారణంగా చెల్లించే మొత్తాలు మినహా: (I) ఏ పక్షంలోని వారైనా ఇతర పక్షాల వారికి వారి వ్యాపారాలు, రాబడులు లేదా ఆశించిన లాభాలలో నష్టాలతో సహా పరోక్షమైన, పరిణామపూర్వక, చెల్లిపోయిన, ప్రత్యేకమైన, చట్టబద్ధమైన, దండనాత్మకమైన లేదా విలక్షణమైన నష్టాలకు లేదా పెనాల్టీలకు ఎలాంటి పరిహారాలను అందజేయడానికి బాధ్యత వహించదు; (II) సిస్టమ్ అందుబాటులో లేకపోవడం లేదా సిస్టమ్ పనితీరులో ఏర్పడే ఆలస్యాలు లేదా లోపాలకు Pinterest ఎలాంటి బాధ్యత వహించదు; (III) ఈ ఒప్పందం కారణంగా లేదా దానికి సంబంధించిన మరే ఇతర చర్యల కారణంగా ఏర్పడే ఏదైనా మరియు అన్ని దావా కారణములకు ప్రకారం ఈ పక్షాలలో ఎవరైనా చెల్లించేందుకు బాధ్యత వహించవలసిన మొత్తం $5,000కు మించకూడదు. సంభవించిన నష్టాలకు సంబంధించిన కారణంతో నిమిత్తం లేకుండా ఈ విభాగంలో ముందుగానే సెట్ చేయబడిన బాధ్యతా పరిమితులు వర్తిస్తాయి. ఈ విభాగంలో చేయబడిన పరస్పర ఒప్పందాలలో రిస్క్‌కి సంబందించిన సహేతుకమైన కేటాయింపుని ప్రతిబింబించడానికి, అలాగే తాము బాధ్యతా పరిమితులు లేకుండా ఒప్పందంలోనికి ప్రవేశించమని అన్ని పక్షాల వారు అంగీకరిస్తున్నారు.

9. కంటెంట్‌ని క్లెయిమ్ చేసే పోర్టల్ మరియు ఈ ఒప్పందానికి మార్పులు

Pinterest కాలానుగుణంగా సిస్టమ్ యొక్క ఆపరేషన్ లేదా దానిలోని ఏదైనా భాగాన్ని మెరుగుపరచవచ్చు, మార్చవచ్చు లేదా నిలిపివేయవచ్చని మీరు అర్థం చేసుకున్నారు. ఉదాహరణకు, సిస్టమ్ ఆపరేషన్‌లో మార్పులను ప్రతిబింబించేలా, Pinterest ఈ ఒప్పందాన్ని సవరించడం కూడా చేయవచ్చు. Pinterest ఈ ఒప్పందానికి ఏదైనా ముఖ్యమైన సవరణల గురించి సహేతుకమైన నోటీసును ముందుగానే అందజేయడంతో పాటు వాటిని సమీక్షించే అవకాశాన్ని కూడా అందిస్తుంది, అలాగే ఇటువంటి మార్పులు తదనంతరం నుండి మాత్రమే వర్తిస్తాయి. అలా సవరించిన ఏవైనా నిబంధనలను మీరు అంగీకరించనట్లయితే, మీరు కలిగి ఉన్న ఏవైనా రెఫరెన్స్ ఫైల్‌లను తీసివేసి, మీ సిస్టమ్ వినియోగాన్ని నిలిపివేసేందుకు మీరు అంగీకరిస్తున్నారు.

10. రద్దు

ఏదైనా పక్షం వారు రద్దు చేస్తే మినహా, ఈ ఒప్పందం కొనసాగుతూ ఉంటుంది. (ఎ) ఇతర పక్షంలోని వారు దివాలాకు సంబంధించిన పిటీషన్‌ను ఫైల్ చేసినా, దివాలా తీసినా లేదా దాని రుణదాతల ప్రయోజనం కోసం ఏదైనా కేటాయింపుని అందజేసినా లేదా ఇతర పక్షానికి చెందిన వారు లేదా దాని వ్యాపారం కోసం ఎవరైనా స్వీకర్తను నియమించినా; సదరు ఇతర పక్షానికి చెందిన వారికి వ్రాతపూర్వక నోటీసుని అందజేయడం ద్వారా వెంటనే (బి) సిస్టమ్‌ని ఉద్దేశ్యపూర్వకంగా పదే పదే దుర్వినియోగం చేసినా లేదా విపరీతమైన దుర్వినియోగ చర్యలు చేస్తున్నా; ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా వెంటనే (సి) ఉప విభాగం(బి)లో పేర్కొన్న విధంగా కాకుండా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు పది (10) రోజుల నోటీసు ముందస్తు వ్రాతపూర్వక నోటీసుతో, అలాంటి ఉల్లంఘనను 10-రోజుల నోటీసు వ్యవధిలోపు సరిదిద్దుకోని పక్షంలో; లేదా (డి) సౌలభ్యం కోసం ముప్పై (30) రోజుల వ్రాతపూర్వక నోటీసుతో; ఏ పక్షానికి చెందిన వారైనా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. ఈ ఒప్పందం ముగిసిన తర్వాత, Pinterest సిస్టమ్ నుండి అన్ని రెఫరెన్స్ ఫైల్‌లను మరియు అనుబంధిత మెటాడేటాను వెంటనే తొలగిస్తుంది. ఏ విధంగా రద్దు చేయబడినప్పటికీ, 6, 7, 8 మరియు 11 పేరాగ్రాఫ్‌లలోని నిబంధనలు మినహాయించబడతాయి. ఈ ఒప్పందం ముగిసిన వెంటనే సిస్టమ్‌ను ఉపయోగించడానికి మీరు కలిగి ఉన్న లైసెన్స్ రద్దు చేయబడుతుంది. సిస్టమ్ నుండి మీ రెఫరెన్స్ ఫైల్‌లను తీసివేసిన తర్వాత 2వ పేరాగ్రాఫ్ క్రింద పేర్కొన్న Pinterest యొక్క లైసెన్స్‌లు రద్దు చేయబడతాయి.

11. గోప్యత

ఈ ఒప్పందం ప్రకారం ఒక పక్షానికి చెందిన వారు "గోప్యమైనదిగా" గుర్తించబడిన ఏదైనా సమాచారాన్ని మరొక పక్షానికి చెందిన వారికి వెల్లడించడం "గోప్యమైన సమాచారం" గా పరిగణించబడుతుంది. గోప్యమైన సమాచారంలో గ్రహీతకు అప్పటికే తెలిసి ఉన్న సమాచారం, గ్రహీత తప్పు లేకుండా బహిర్గతమయ్యే సమాచారం, గ్రహీత స్వయంగా, స్వతంత్రంగా అభివృద్ధి చేసుకున్న సమాచారం లేదా మూడవ పక్షం గ్రహీతకు చట్టబద్ధంగా అందజేసిన సమాచారం వంటివి ఉండకూడదు. గ్రహీత అలా స్వీకరించిన గోప్యమైన సమాచారాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉన్న మరియు దాని గోప్యతను కాపాడతానని వ్రాతపూర్వకంగా అంగీకరించిన ఉద్యోగులు మరియు ఏజెంట్‌లకు మినహా ఇతరులెవరికీ వెల్లడించరు. ఈ ఒప్పందం ప్రకారం, ఆ వ్యక్తులు మరియు సంస్థలు తమ హక్కులు మరియు బాధ్యతలను నెరవేర్చడానికి మాత్రమే గోప్యమైన సమాచారాన్ని ఉపయోగిస్తాయనీ, అలాగే వారు దానిని గోప్యంగా ఉంచుతారనీ గ్రహీత నిర్ధారిస్తారు. అలాగే చట్టప్రకారం అనుమతించబడే పక్షంలో, గ్రహీత బహిర్గతం చేసినవారికి సహేతుకమైన నోటీసు ఇచ్చిన తర్వాత చట్టప్రకారం అవసరమైనప్పుడు గోప్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయవచ్చు. 

12. ప్రచారం

అవతలి పక్షానికి చెందిన వారి నుండి ఎలాంటి వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఈ ఒప్పందానికి సంబంధించి ఎలాంటి బహిరంగ ప్రకటన చేయమని అన్ని పక్షాల వారు అంగీకరిస్తారు.

13. చట్టం/ఫోరమ్ యొక్క ఎంపిక

కాలిఫోర్నియాలో చట్టాల వైరుధ్యం నిబంధనలు మినహాయించి, ఈ ఒప్పందం కాలిఫోర్నియా చట్టం ద్వారా నిర్వహించబడుతుంది, అలాగే ఒప్పందం లేదా Pinterest ప్లాట్‌ఫారమ్‌కి సంబంధించిన లేదా వాటి నుండి ఏర్పడే ఏవైనా క్లెయిమ్‌లు ప్రత్యేకంగా కాలిఫోర్నియా, USAలోని శాన్‌ఫ్రాన్సిస్కో కౌంటీలో ఉండే ఫెడరల్ లేదా స్టేట్ కోర్ట్‌లలో క్లెయిమ్ చేయబడతాయి; ఆ కోర్ట్‌లలో వ్యక్తిగత అధికార పరిధికి అన్ని పక్షాలు సమ్మతి అందిస్తాయి.

14. సాధారణం

పక్షాలకు చెందిన వారు ఈ ఒప్పందాన్ని ప్రతిరూపాలలో అమలు చేయవచ్చు, ఇవన్నీ కలిపి ఒక అధికారపత్రాన్ని కలిగి ఉంటాయి. https://policy.pinterest.com/terms-of-service లింక్‌లో Pinterest సేవా నిబంధనలతో పాటు అందుబాటులో ఉండే ఈ ఒప్పందం, పక్షాల మధ్య అంగీకరించబడిన అన్ని ఇతర నిబంధనలను నిర్దేశించడంతో పాటు ఈ విషయంగా వారి మధ్య ఉన్న అన్ని ఇతర ఒప్పందాలను భర్తీ చేస్తుంది. ఈ ఒప్పందంలోని ఏదైనా నిబంధన (లేదా నిబంధనలోని భాగం) చెల్లుబాటు కానిదిగా, చట్టవిరుద్ధమైనదిగా లేదా అమలు చేయలేనిదిగా ఉన్నట్లయితే, మిగిలిన ఒప్పందం అమలులో ఉంటుంది. ఈ ఒప్పందంలోని ఏవైనా నిబంధన మరియు మీరు సిస్టమ్‌ని వినియోగించడానికి వర్తించే పక్షాల మధ్య ఉన్న ఏదైనా ఇతర ఒప్పందం మధ్య విభేదం తలెత్తినట్లయితే, ఈ ఒప్పందంలోని నిబంధనలు వైరుధ్యం పరిధి మేరకు నియంత్రిస్తాయి. ఈ ఒప్పందంలోని ఏ భాగాన్ని మరొకరి వ్రాతపూర్వక అనుమతి లేకుండా అనుబంధ సంస్థకు తప్ప ఈ క్రింది సందర్భాలలో మినహా ఇతరులెవరికీ కేటాయించరాదు: (ఎ) కేటాయింపు పొందిన పక్షం ఈ ఒప్పందంలోని నిబంధనలకు కట్టుబడి ఉండేందుకు లిఖితపూర్వకంగా అంగీకరించడం; (బి) కేటాయింపు పొందిన పక్షం డిఫాల్ట్ చేసినట్లయితే, ఒప్పందం ప్రకారం వారికి కేటాయించిన పక్షం వారు బాధ్యత వహించాల్సి రావడం; అలాగే (సి) కేటాయించిన పక్షం వారు కేటాయింపుని గురించి అవతలి పక్షానికి తెలియజేయడం. కేటాయింపుకి సంబంధించిన మరే ఇతర ప్రయత్నాలు చెల్లుబాటు కావు. సహేతుకమైన నియంత్రణకు మించిన పరిస్థితుల కారణంగా కలిగే వైఫల్యం లేదా పనితీరు ఆలస్యం వంటి వాటికి ఏ పక్షానికి చెందిన వారు కూడా బాధ్యత వహించరు. ఈ ఒప్పందం ప్రకారం హక్కుదారులకు సంబంధించిన ఏదైనా నోటీసు తప్పనిసరిగా (1) సిస్టమ్ ద్వారా హక్కుదారుకి ఎలక్ట్రానిక్‌గా ప్రదర్శించబడుతుంది లేదా (2) సిస్టమ్‌లోని హక్కుదారుల‌తో అనుబంధించబడిన ఇమెయిల్ చిరునామాకు పంపబడుతుంది. Pinterestకు సంబంధించిన ఈ ఒప్పందం ప్రకారం ఏదైనా నోటీసుని తప్పనిసరిగా copyright [at] pinterest.com (copyright[at]pinterest[dot]com) చిరునామాకు పంపాల్సి ఉంటుంది.